Sankranti: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ.. రూ.800 నుంచి రూ.1000 అదనంగా వసూలు..
సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ వారికి పండుగే.. ప్రయాణికుల వద్ద డబుల్, ట్రిఫుల్ డబ్బు వసూలు చేసి కోట్లు సంపాదిస్తుంటారు. ఈసారి కూడా అదే దోపిడీ కొనసాగిస్తున్నారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు. అందుకే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రులు సొంతూళ్లకు వెళ్తారు. ఇదే అదునుగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లు దొచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

800 నుంచి 1000 రూపాయలు
ఈ సంవత్సరం కొన్నిచోట్ల 14, 15, 16న భోగి, సంక్రాంతి, కనుమ జరుపుకుంటుంటే.. మరికొన్ని చోట్ల 15, 16, 17న పండుగ జరుపుకుంటున్నారు. అందువల్ల ఏపీకి చెందిన హైదరాబాద్ తో పాటు కర్ణాటకలో చాలా మందే ఉన్నారు. వీరంతా ఏపీకి వెళ్లేందుకు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు సరిపోక ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్.. ఛార్జీల రేట్లను డబుల్ చేసేశాయి. సాధారణ ఛార్జీల కంటే ఏసీ స్లీపర్‌లో ఒక్కో బెర్తుకీ 800 నుంచి 1000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయి. అలాగే ఏసీ సీటర్‌లో 700 నుంచి 800 రూపాయలు ఎక్స్‌ట్రా ఛార్జ్ చేస్తున్నాయి.

తనిఖీలు
పండుగల సమయంలో కంటే.. సొంతూళ్లకు మామూలు రోజుల్లో వెళ్లడం బెటరేమో అని ప్రజలు అనుకునేలా ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరిస్తున్నాయి. సంక్రాంతి పండు రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ, ఫిట్‌నెస్ లేని బస్సులను సైతం రోడ్డుకు తీసుకువస్తుండటంతో ఆర్టీఏ అధికారులు తనిఖీలు మొదలు పెట్టారు. గురువారం నాడు హయత్‌నగర్-విజయవాడ హైవేపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. అటు విశాఖపట్నంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

6 బస్సులు సీజ్
ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని 6 బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.20కి పైగా బస్సులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అధికంగా డబ్బులు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు కోరుతున్నారు. అధికంగా డబ్బులు తీసుంటే ట్రావెల్స్ పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications