టిడిపి బాలకృష్ణ సినిమాకు వైసిపి చీఫ్ జగన్ అనుచరుడి కథ?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ముస్తాబవుతోంది. ఆ తర్వాత కూడా మరో రెండు సినిమాలకు అతను పచ్చ జెండా ఊపారు.

చంద్రబాబు ఇటీవలే 'రైతు' సినిమాను ధృవీకరించారు. రైతుల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుచరుడిగా చెప్పుకునే ప్రియదర్శిని రామ్ 'రైతు' చిత్రానికి కథ అందిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Priyadarshini ram Script for Balakrishna!

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. బాలకృష్ణ గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో, ప్రియదర్శిని రామ్.. జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో ఫీచర్స్ ఎడిటర్. వీరి కలయికపై ఊహాగానాల నేపథ్యంలో.. అది చర్చనీయాంశంగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Priyadarshini ram Script for Hero Nandamuri Balakrishna cinema!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి