ప్రొద్దుటూరులో ఉద్రిక్తత: వైసీపీ ఎమ్మెల్యే అరెస్టు, లాఠీ ఝళిపించిన పోలీస్
జలదీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, మునిసిపల్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కడప: వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిని కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ప్రొద్దుటూరుకు తాగునీరు అందించాలని కోరుతూ సోమవారం ఉదయం అక్కడి ప్రజలతో కలిసి ఆయన నిరసనచేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ జలదీక్షకు పూనుకున్నారు.
అయితే పోలీసులు ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిని అడ్డుకున్నారు. జలదీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, మునిసిపల్ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో లాఠీలకు పనిచెప్పిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.

ఎమ్మెల్యేను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడంతో స్థానిక వైసీపీ శ్రేణులు రహదారులను దిగ్బంధించి నిరసనకు దిగారు. శివప్రసాదరెడ్డి అరెస్టును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.












Click it and Unblock the Notifications