ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన అశ్వినీదత్..!!
ఏపీలో ఎన్నికల ఫలితాల పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరు గెలుస్తారనే అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సెఫాలజిస్టులతో పాటుగా సినీ ప్రముఖులు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటిస్తున్నాయి. పార్టీల అధినేతలు తమ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ లోలోపల మాత్రం గుబులు మొదలైంది. పెద్ద సంఖ్యలో పోలైన మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది కీలకంగా మారుతోంది. ఈ సమయంలో ప్రముఖనర్మిత అశ్వినీతద్ ఏపీ ఎన్ినకల ఫలితాల పైన తన అంచనాలను వెల్లడించారు.
ఏపీలో టీడీపీ కూటమి 160కి పైగా స్థానాలు గెలుస్తుందని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అంచనా వేసారు. 175 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు కూటమి 160కి పైగా స్థానాలు గెలుస్తుందని చెప్పటం పైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు వెల్లడిస్తున్న ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని కూటమి గెలుపు ఖాయమని చెబుతుండగా..మరి కొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా అంచనాలను వెల్లడిస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థలు సైతం ఏపీ ఫలితాల పైన భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.

ఇటు జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స ఎలా ఉన్నా..అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఇప్పటికే జగన్ ప్రమాణ స్వీకారం గురించి వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఏపీలో హోరా హోరీగా సాగిన ఎన్నికల పోరులో జూన్ 4న జరిగే కౌంటింగ్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో..ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా రాజకీయంగా భిన్నమైన అంచనాలు వెల్లడవుతున్నాయి.
చంద్రబాబు 160 సీట్లు కచ్చితంగా గెలుస్తారు- అశ్వినీదత్ ఎగ్జిట్ పోల్స్#Chandrababu #AshwiniDutt #TDP #NDAallaince #ExitPolls2024 #ApExitPolls2024 #ExitPolls #OneindiaElectionResults pic.twitter.com/PdHLU0ZXoG
— oneindiatelugu (@oneindiatelugu) June 1, 2024












Click it and Unblock the Notifications