చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన నిర్మాత సురేష్ బాబు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం రిమాండ్ పై రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. రూ.370 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే ఎఫ్ఐఆర్ లో పేరే లేని కేసులో చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రశ్నలు సంధిస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ కు సినీ రంగం నుంచి దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, మరో నిర్మాత కె.ఎస్.రామారావు స్పందించారు. మోడీ ప్రమేయం లేకుండా, ఆయనకు తెలియకుండా ఎలా అరెస్ట్ జరుగుతుందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మోడీని కోరుతూ రామారావు లేఖను విడుదల చేశారు. వీరు మినహా చిత్ర పరిశ్రమలో చంద్రబాబు అరెస్ట్ పై ఎవరూ బయటకు మాట్లాడలేదు. "సప్త సాగరాలు దాటి" సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు పాల్గొన్నారు.

చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమకు ఎందుకు మౌనంగా ఉందని ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన సురేష్ బాబు "తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటుందని, సెన్సిటివ్ విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన ఉండదని, తెలంగాణ, ఆంధ్ర విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదు" అంటూ సమాధానం ఇచ్చారు.
Ace producer #SureshBabu responds about #ChandraBabuNaiduArrest at the #SaptaSagaraluDhaati movie press meet.#ChandraBabuNaidu #RakshitShetty #TeluguFilmNagar pic.twitter.com/46MyLEvIMe
— Telugu FilmNagar (@telugufilmnagar) September 19, 2023
ప్రస్తుతం నిర్మాత సురేష్ బాబు సినిమాలు నిర్మించడంకన్నా డిస్ట్రిబ్యూషన్ పైనే ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చేస్తున్నారు. పలు సినిమాలను ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నారు. సినిమాలు తక్కువగా నిర్మిస్తున్నారు.. కారణమేంటని మరో ప్రశ్న కూడా ఆయనకు ఎదురైంది. పరిస్థితులకు తగినట్లుగా సినిమాలు తీస్తున్నామన్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!











Click it and Unblock the Notifications