స్టోర్ కీపర్‌పై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు, దేహశుద్ధి

తాను ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదని, అంతేకాకుండా ఆస్పత్రి సిబ్బంది కూడా దీనిపై స్పందించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.. దీంతో తన గోడును బంధువుల వద్ద చెప్పుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ప్రొఫెసర్‌ను నిలదీశారు.
దానికి అతను సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం చెందిన బంధువులు అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించి, సరైన శిక్ష విధించాలని కోరారు.
స్థానికంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది. ఇప్పటికైనా పోలీసులు ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. ప్రొఫెసర్‌కు దేహశుద్ధి చేసిన దృశ్యాలను తెలుగు టీవి చానెళ్లు ప్రసారం చేశాయి.












Click it and Unblock the Notifications