'ప్రాజెక్ట్ కె' చిత్రం టైటిల్ ఖరారు.. గ్లింప్స్ విడుదల

సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ప్రాజెక్ట్‌ కె'(Project K) నుంచి గ్లింప్స్‌ విడుదలైంది. ఈ చిత్రానికి 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) టైటిల్‌ను ఖరారు చేశారు. 'ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం అరంభమవుతుంది' అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగనుందని తెలుస్తోంది.

'వాటీజ్‌ ప్రాజెక్ట్‌ కె' అనే ఒక్క డైలాగ్‌తో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రభాస్‌ లుక్‌ అదిరిపోయిందని చెప్పవచ్చు. అమెరికాలో జరుగుతున్న 'శాన్‌ డియాగో కామిక్ కాన్‌' వేడుకలో చిత్ర బృందం గ్లింప్స్‌, టైటిల్‌ని ప్రకటించి సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌ చేసింది. కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది. ప్రభాస్‌, కమల్‌ హాసన్‌ , నిర్మాత అశ్వనీదత్‌ , రానా దగ్గుబాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

projectk

'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడనే ప్రకటన వెలువడి తర్వాత దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తుండడంతోపాటు బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా, దిశా పటానీ కీ రోల్‌ చేస్తుండటంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

బాహుబలి తర్వాత ప్రభాస్ గత సినిమాలు సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లుగా నిలిచాయి. సెప్టెంబరు 28వ తేదీన విడుదల కాబోతున్న సలార్ చిత్రంద్వారా అసలైన మాస్ హిట్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను దేశవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా వీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+