ఎన్డీసీ: ప్రత్యేకహోదాపై ఎపికి ఊరట దక్కేనా? ఇప్పటికివే
న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని గత యూపిఏ ప్రభుత్వం సిఫార్సు చేయగా.. బిజెపి పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే, ప్రణాళికా సంఘం దీనిపై కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఎపి ప్రత్యేక హోదాకు అర్హత సాధించలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎపికి ప్రత్యేక హోదా లభిస్తుందా? అనే చర్చ సాగుతోంది.
ప్రణాళికా సంఘం ఇచ్చింది కేవలం నివేదిక మాత్రమేనని... ఆదేశాలు కాదంటున్నారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్, బిజెపిలు కట్టుబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. సమాచారం మేరకు... ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎన్డీసీ ఆమోదిస్తే ఎపికి ప్రత్యేక హోదా లభించవచ్చునని అంటున్నారు.

ఎపికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ సిఫార్సు చేయగా, పదేళ్లు ఇవ్వాలని గతంలో బిజెపి డిమాండ్ చేసింది. ఆ రెండు పార్టీలు కూడా ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయి. ఎన్డీసీ సమావేశం ప్రధాని నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఉంటారు. వారి ఆమోదంతో ఎపికి ప్రత్యేక హోదా లభించవచ్చునని చెబుతున్నారు.
అలాగే, దేశంలోనే అనంతపురం వంటి జిల్లా చాలా వెనుకబడి ఉంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు సమస్యలతో కేంద్రం ముందు నివేదిక ఉంచుతుందని, వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వవచ్చునని చెబుతున్నారు.
పదేళ్ల విషయాన్ని పక్కన పెడితే మోడీ ప్రభుత్వం... కేంద్రం హామీ మేరకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదాకు ప్రత్యేకంగా కసరత్తు చేస్తుందని, ఎన్డీసీలో తీర్మానం చేస్తుందని చెబుతున్నారు. ప్రణాళికా సంఘం సిఫార్సుతో సంబంధం లేకుండా ఎన్డీసీ తీర్మానం చేస్తే ప్రత్యేక హోదా లభించవచ్చునని చెబుతున్నారు.
కాగా, జాతీయ అభివృద్ధి మండలి నిబంధనల ప్రకారం కొండలు, దుర్గమ ప్రాంతాలు అధికంగా ఉండడం, జనసాంద్రత తక్కువగా ఉండి, పెద్ద సంఖ్యలో గిరిజనులు నివసిస్తుండడం, వ్యూహాత్మక సరిహద్దు రాష్ట్రమై ఉండడం వంటి లక్షణాలు ఉంటే దానికి ప్రత్యేక హోదా వర్తిస్తుంది.
ఇప్పుడు ఇచ్చిన కొత్త రాష్ట్రాలతో కలిపి పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరామ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, సిక్కిం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉన్నాయి.












Click it and Unblock the Notifications