ముంబై మోడళ్లతో వ్యభిచారం, సినీ ఫైనాన్షియర్ అరెస్ట్

అందులో కొంత భాగాన్ని సబ్ లీజుకు ఇతర వ్యక్తులకు ఇచ్చారు. గుంటూరుకు చెందిన ఓ సినీ ఫైనాన్షియర్ తన వ్యాపారం కోసం నలభై వైలకు అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో ఆ ఫైనాన్షియర్‌తో పాటు ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వహించి ముంబైకి చెందిన వ్యక్తి, మరో ఇద్దరితో పాటు ఇద్దరు యువతులు, హైదరాబాదుకు చెందిన మరో మహిళ పట్టుబడ్డారు. నిందితులను జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.
వీరి వద్ద నుండి ఇరవై వేల రూపాయల నగదును, ఎనిమిది సెల్ పోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరు పర్చారు. పట్టుబడ్డ యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. పట్టుబడ్డ వారిలో ముంబైకి చెందిన మోడల్స్ ఉన్నారు. వీరు ఇంటర్నెట్‌లో యువతుల ఫొటోలు పెట్టి విటులను ఆకర్షించి హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications