రెస్క్యూ హోంలో వినోదం పంచుతూ నటి శ్వేతబసు!

హైదరాబాద్: వ్యభిచారం కేసులో పట్టుబడి అరెస్టయిన నటి శ్వేతబసు ప్రసాద్ హైదరాబాద్‌లోని రెస్క్యూ హోంలో ఇతర పిల్లలు, మహిళలతో సరదాగా గడుపుతోంది. రెస్క్యూ హోంలోని ఇతర పిల్లలు, మహిళలతో సంగీతం, జీవితం గురించిన విషయాలను చెబుతూ వారితో శ్వేతబసు సరదాగా గడుపుతోందని ఆమె కేసు అటెండింగ్ జడ్జీ ఆమె తల్లితో చెప్పినట్లు తెలిసింది.

టీవీ నటి, తెరపై శ్వేతబసుకు తల్లిగా నటించిన సాక్షి తన్వార్.. వ్యభిచారం కేసులో శ్వేతబసు అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే తన భావాలను మీడియాతో పంచుకున్నారు. రెస్క్యూ హోంలో ఉంటున్న శ్వేతబసును కలిసేందుకు ఆమె కన్నతల్లిని అనుమతించడం లేదని సాక్షి తన్వార్ అన్నారు.

శ్వేతబసు రెస్క్యూ హోంలోని ఇతర పిల్లలు, మహిళతో సరదాగా, వినోదం పంచుతూ గడుపుతోందని అటెండింగ్ జడ్జి ఆమె తల్లితో చెప్పినట్లు సాక్షి తన్వార్ తెలిపారు. ఈ విషయాలను ఆమె ఓ లేఖలో వెల్లడించారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా, శ్వేతబసుతో తాను మాట్లాడాలని అనుకున్నట్లు సాక్షి తన్వార్ చెప్పారు. అలా వీలుకాకపోవడంతోనే ఆమె తల్లితో మాట్లాడానని చెప్పారు.

Shweta Basu

‘శ్వేతబసును కలిసేందుకు ఆమె తల్లిని అనుమతివ్వడం లేదని ఎంతమందికి తెలుసు? రెస్క్యూ హోంలో అటెండింగ్ జడ్జి చెప్పిన విధంగా శ్వేతబసు ఉందని ఎవరికి తెలుసు?' అని సాక్షి తన్వార్ ప్రశ్నించారు. శ్వేతబసు తల్లి తీవ్ర ఆవేదనకు గురవుతోందని ఆమె చెప్పారు. వ్యభిచారం కేసులో శ్వేతబసు ప్రసాద్ తోపాటు ఇతర వ్యాపారవేత్తలు అరెస్టయినప్పటికీ వారి వివరాలను మీడియాకు ఎందుకు వెళ్లడించడం లేదని సాక్షి తన్వార్ పోలీసులను ప్రశ్నించారు.

సినీ అవకాశాలు రాకపోవడం, ఆర్థిక ఇబ్బందుల మూలంగానే తాను ఈ దారి ఎంచుకోవాల్సి వచ్చిందని శ్వేతాబసు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, బాలీవుడ్ చిత్రం ‘మక్దీ'లో నటించిన శ్వేతబసుకు జాతీయ అవార్డు వచ్చింది. ఆమె పలు హిందీ, తెలుగు చిత్రాల్లో, టీవీ సీరియల్ష్‌లో ఆమె నటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+