Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయవాడ కోర్టు ముందు హైటెన్షన్, భారీగా వస్తున లేడీ లీడర్స్, ఎక్కువ చేస్తే !

విజయవాడ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చెయ్యడానికి ముందుగానే రంగం సిద్దం చేసుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా శనివారం వేకువ జామున నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేశారు.

నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన తరువాత రోడ్డు మార్గంలో ఆయన్ను విజయవాడకు తరలించిన విషయం తెలిసిందే. నంద్యాల టూ విజయవాడకు చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడ పిలుచుకుని వెళ్లడంతో మార్గం మధ్యలో అనేక నగరాలు, పట్టణాలు. గ్రామాల దగ్గర టీడీపీ నాయకులు చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు.

TDP women leaders

టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న సీఐడీ పోలీసులు సోమవారం సాయంత్రానికి చంద్రబాబు నాయుడిని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. విజయవాడలోని సిటీ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తారని తెలుసుకున్న టీడీపీ మహిళా కార్యకర్తలు కోర్టు కాంప్లెక్స్ ముందు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

అయితే కోర్టు కాంప్లెక్స్ ముందు గుమికూడిన టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చెయ్యడానికి ప్రయత్నించిన టీటీడీ మహిళా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడతో పాటు గుంటూరు, క్రిష్ణా తదితర జిల్లాల నుంచి భారీ ఎత్తున టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు విజయవాడకు తరలివస్తున్నారు.

TDP women leaders

నియమాలు ఉల్లంఘించి ప్రవర్తిస్తే అరెస్టులు చేస్తామని టీడీపీ మహిళా నాయకులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ దగ్గర టీడీడీ మహిళా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు వాహనాల్లో వారిని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+