ఈడ్చుకెళ్లేవరకు వెళ్లిన సైకో వన్‌సైడ్ లవ్ : పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు
పశ్చిమ గోదావరి : ప్రేమించమనే వేధింపులు ఎక్కువవుతున్నాయి. అమ్మాయిల వెంట పడటం, లవ్ చేయమని బెదిరించే ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో ఓ సైకో యువతిని ఏకంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఆమెతో ఉన్న ఫ్రెండ్ .. స్థానికులు కలిసి యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు.

ప్రేమ పేరుతో వేధింపులు
విస్సాకోడేరుకు చెందిన అనుషను కాలేశ్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. అందుకు ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో ఆమెను కిడ్నాప్ చేసైనా సరే లొంగదీసుకోవాలని వ్యుహరచన చేశాడు. మంగళవారం విస్సాకోడేరులో కారులో వచ్చి అనుషను బలవంతంగా కారులో ఎక్కించుకొని పోయాడు. అయితే అనుష, ఆమె స్నేహితురాలు అరుణకుమారి ప్రతిఘటించడంతో అతని ఆటలు సాగలేదు.

కారు డోర్ పట్టుకుని మరీ ..
అనుషను కారులో తీసుకెళుతుండగా .. అరుణకుమారి కారు డోర్ పట్టుకుని వేలాడింది. కానీ అతడు కారును వేగంగా పోనిచ్చాడు. ఇంతలో అరుణ .. జరిగిన విషయాన్ని స్థానికులు చెప్పడంతో వారు కారును వెంబడించారు. విస్సాకోడేరు నుంచి భీమవరం మండలం తాడేరు వరకు దాదాపు 10 కిలోమీటర్ల వెళ్లాడు. కారును వెంబడించిన స్థానికులు .. ఎట్టకేలకు పట్టుకొని, ఓ యువతి జీవితాన్ని కాపాడారు.

ఛేజ్ చేసి .. చేయ్యేసి ...
కారును ఛేజ్ చేసిన స్థానికులు కాలేశ్ కబంధహస్తాల నుంచి అనుషను రక్షించారు. అంతేకాదు కాలేశ్‌కు దేహశుద్ది చేశారు. తర్వాత పాలకోడేరు పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. బాధిత యువతి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications