ఒంటరి మహిళలు కన్పిస్తే చీరె లాగుతాడు, అసభ్యంగా ప్రవర్థిస్తాడు
విశాఖ పట్టణంలో సైకో హల్ చల్ చేస్తున్నాడు. ఒంటరి మహిళలు కన్పిస్తే చాలు వారి ఒంటిమీద ఉన్న చీరెలను లాగేస్తున్నాడు. బ్లేడులతో వారిపై దాడులకు పాల్పడుతున్నాడు.సైకోను పట్టుకొనేందుకు స్థానిక యువకులు గస్తీ తిర
విశాఖ పట్టణం :మహిళలు ఒంటరిగా కన్పిస్తే సైకో విజృంభిస్తున్నాడు. ఒంటరి మహిళల చీరెలను లాగుతున్నాడు. తిరగబడితే బ్లేడ్లతో దాడికి దిగుతున్నాడు. అర్థరాత్రిపూట ఇళ్ళపై రాళ్ళ దాడులు చేస్తున్నాడు. విశాఖ వాసులకు ఓ సైకో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.
విశాఖ పట్టణంలోని 51వ, వార్డు సీతానగరం రజకవీధివాసులు సైకో తో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. సుమారు నలభై ఏళ్ళ వయస్సున్న వ్యక్తి సైకో గా మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు గుర్తించారు.
రజకవీధి పరిసర ప్రాంతాల్లో నలభై ఏళ్ళ వయస్సున్న వ్యక్తి ఓంటరి మహిళలు కన్పిస్తే చాలు చీరలులాగివేస్తున్నాడు. చీకటిపడితే చాలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బ్లేడుతో మహిళలను గాయపరుస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.

సాయంత్రమైతే ఈ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. సైకో కోసం వెతుకుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఈ దాడులు చేస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు.
ఈ సైకో ను పట్టుకొనేందుకు చాలసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు స్థానికులు
కిటీకీల పక్కనే నిద్రించే మహిళలను లక్ష్యంగా చేసుకొని కిటీకీలకు ఉన్న వలను తొలగించి అసభ్యకరపనులకు పాల్పడుతున్నాడు. దీంతోపాటుగా భయం కలిగేలా వ్యవహరిస్తున్నాడు.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదుచేసిన ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. సైకోను పట్టుకొనేందుకు స్థానిక యువకులు గస్తీ తిరుగుతున్నారు.
మహిళలు ఒంటరిగా కన్పిస్తే సైకో విజృంభిస్తున్నాడు. ఒంటరి మహిళల చీరెలను లాగుతున్నాడు. తిరగబడితే బ్లేడ్లతో దాడికి దిగుతున్నాడు. అర్థరాత్రిపూట ఇళ్ళపై రాళ్ళ దాడులు చేస్తున్నాడు. విశాఖ వాసులకు ఓ సైకో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications