శ్రీవారి సేవలో రాధాకృష్ణ: సి23 కౌంట్‌డౌన్(పిక్చర్స్)
నెల్లూరు: మరో వాణిజ్య రంగ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి జూన్ 30న పిఎస్‌ఎల్‌వి-సి 23 వాహక నౌక ద్వారా వాణిజ్య రంగానికి చెందిన ఐదు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో గురిపెట్టింది.
ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 8:52గంటలకు ప్రారంభమైంది. ప్రయోగానికి 49:00గంటలు ముందు ప్రారంభమైన కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే జూన్ 30న ఉదయం 9.52 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగరనుంది.
ఈ రాకెట్ ద్వారా ఫ్రాన్సు దేశానికి చెందిన 712కిలోల బరువుగల స్పాట్-7 ఉపగ్రహంతో పాటు కెనడా, సింగపూర్, జర్మనీ దేశానికి చెందిన ఐదు ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం డాక్టర్ సురేష్ అధ్యక్షతన మిషన్ రెడీనెష్ రివ్యూ (ఎంఆర్‌ఆర్), లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్‌ఎబి) చైర్మన్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ అధ్యక్షతన శాస్తవ్రేత్తలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించి ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ 29న షార్‌కు చేరుకొని శాస్తవ్రేత్తలతో కలసి ప్రయోగ వేదిక వద్దకు చేరుకొని కౌంట్‌డౌన్ ప్రక్రీయను పరిశీలించనున్నారు. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం షార్‌కు రానున్నారు. కాగా, పిఎస్‌ఎల్‌వి-సి 23 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో శుక్రవారం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో..
పిఎస్‌ఎల్‌వి-సి 23 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో శుక్రవారం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారిలో సేవలో..
మరో వాణిజ్య రంగ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమైంది.

శ్రీవారి సేవలో..
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి జూన్ 30న పిఎస్‌ఎల్‌వి-సి 23 వాహక నౌక ద్వారా వాణిజ్య రంగానికి చెందిన ఐదు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో గురిపెట్టింది.

శ్రీవారి సేవలో..
ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 8:52గంటలకు ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications