సాయంత్రం నాలుగయిందంటే చాలు.. కడప బ్యూటీస్ బహిరంగ వ్యభిచారం

కడప : సాయంత్రం 4గం.అయిందంటే చాలు. ఆ మైదానంలో బహిరంగ వ్యభిచారానికి తెరలేస్తుంది. పక్కనుంచి ఎంతమంది వెళ్తున్నా.. వారికదేం పట్టదు. వేశ్యలతోను, హిజ్రాలతోను విటులు తమ సరస సల్లాపాలు సాగించడానికి ఆ మైదానాన్ని అడ్డాగా మార్చుకున్నారు. ఆ జుగుప్సను చూడలేక మహిళలంతా తలదించుకు వెళ్లాల్సిందే తప్పితే.. పోలీసులు అటువైపు కనీసం తొంగి చూడట్లేదన్న ఆరోపణలున్నాయి.

ఇంతకీ ఆ మైదానం ఎక్కడుందంటే.. కడప నగరం నడిబొడ్డున ఉన్న రాయల్ థియెటర్ సమీపంలోని బుగ్గవంక ప్రహారీగోడకు ఆనుకుని ఉంది. ఇంకా ఆశ్చర్యమేంటంటే.. దీనికి అతి సమీపంలోనే జువైనల్ హోమ్ కూడా ఉంది. స్కూల్ పిల్లలు, ద్విచక్ర వాహనాదారులు, మహిళలు నిత్యం ఈ దారి గుండా వెళ్తుంటారు. ఇదే మైదానంలో కంపచెట్లున్న చోట చాలావరకు ఖాళీ మైదానం ఉంది.

public prostitution in kadapa

ఇక ఈ ఖాళీ మైదానమే అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. సాయంత్రం 4గం. అయిందంటే చాలు.. కడప బ్యూటీస్ అనే హిజ్రా బ్యాచ్ అక్కడ వాలిపోతుంది. విటులతో అక్కడే పబ్లిక్ గా వ్యభిచారం కొనసాగిస్తుంటుంది ఈ బ్యాచ్. ఇక పలువురు యువకులు కూడా వేశ్యలను నేరుగా మైదానానికి తీసుకొచ్చి శృంగార కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. అతి దగ్గరలోనే వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నా.. వారెందుకు పట్టించుకోవట్లేదో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో.. ఆ మార్గం గుండా వెళ్లాలంటేనే జుగుప్సకు లోనవుతున్నారు స్థానికులు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+