బోటులో విహరించిన పురంధేశ్వరి, 'హిందూ మతవిశ్వాసాలపై దాడి'

రాజమండ్రి: భారతీయ జనతా పార్టీ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు బుధవారం నాడు రాజమండ్రిలో పుష్కర స్నానం ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు బోటులో విహరించారు.

నాలుగేళ్లలో పోలవరం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం చెప్పారు. నీటి ప్రాముఖ్యత - నదుల అనుసంధానం పైన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కెఎల్ రావు స్ఫూర్తి ప్రధాత కావాలన్నారు. సముద్రంలో వృధాగా పోయే వెయ్యి టీఎంసీల గోదావరి నీటిని ఉపయోగించుకోగలిగితే ఏపిని రువు నుంచి బయటపడేయవచ్చునని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు.

Purandeswari holy dip at Rajahmundry Pushkara Ghat

రాజమండ్రి పుష్కర ప్రమాదం పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం ఢిల్లీలో స్పందించారు. ఇది దురదృష్టకరమన్నారు.

పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని చెప్పారు. కుంభమేళా తరహాలో చర్యలు చేపడితే బాగుండేదన్నారు. బాధితులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

కాగా, రాజమండ్రి ఘటనతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని కమలానంద భారతి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. హిందూమత విశ్వాసాలని దెబ్బతీసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+