రాజమండ్రికి పురందేశ్వరి - పరామర్శ..!!

ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత కొత్త లెక్కలు మొదలయ్యాయి. టీడీపీ,జనసేన పొత్తు ఖాయమైన తరువాత బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారింది. ఈ సమయంలోనే టీడీపీ నేత నారా లోకేశ్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆ సమయంలో పురందేశ్వరి సమావేశంలో ఉన్నారు. ఇప్పుడు పురందేశ్వరి రాజమండ్రి వెళ్తున్నట్లు సమాచారం. పరామర్శకు వెళ్తున్నారని చెబుతున్నారు.

ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఏంటనేది కీలకంగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైన వేళ బీజేపీ తమతో కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు. కానీ, బీజేపీ నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. ఇటు చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనేది టీడీపీ నేతల అనుమానం. తాను టీడీపీతో పొత్తు ప్రకటన చేయటం వెనుక కారణాలను బీజేపీ ముఖ్య నేతలను కలిసి వివరిస్తానని పవన్ చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి సమావేశం జరగలేదు. పొత్తు ప్రకటన తరువాత పవన్ వారాహి యాత్రకు స్పందన తగ్గిందనే లెక్కలు వినిపిస్తున్నాయి. ఇటు చంద్రబాబు కేసుల్లో న్యాయపోరాటం కొనసాగుతోంది. ఇటు వైసీపీ ఎన్నికల కార్చాచరణ ప్రారంభించింది.

Purandeswari likely to meet Bhuvaneswari and Brahmani in Rajahmundry on Friday

ఈ సమయంలోనే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు శుక్రవారం రాజమండ్రి వెళ్తున్నట్లు సమాచారం. సోదరి భువనేశ్వరి, నారా బ్రాహ్మణిని పరామర్శ కోసమే రాజమండ్రి వెళ్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. అయితే, బీజేపీ అధ్యక్ష హోదాలో కాకుండా కుటుంబ సభ్యురాలిగా వ్యక్తిగత హోదాలో వెళ్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా నారా లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సమయంలోనూ పురందేశ్వరి అక్కడే ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని ప్రచారం చేసిన నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆ సమావేశం తరువాత పురందేశ్వరి ప్రశ్నించారు. అయితే, ఈ సమయంలోనే టీడీపీ, బీజేపీ పొత్తు అంశం పైన చర్చ మొదలైనా...టీడీపీ నేతలు మాత్రం కేవలం వైసీపీ ప్రభుత్వంపైన ఫిర్యాదు చేయటం కోసమే అమిత్ షా ను లోకేష్ కలిసారని వివరణ ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+