అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్నీ చేశాం, ఇంకా చేస్తాం, డిపిఆర్ లేకుండా అమరావతికి నిధులా?: పురంధేశ్వరి

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, నిధుల గురించి వివరించారు భారతీయ జనతా పార్టీ జాతీయ మహిళామోర్చా నాయకురాలు పురంధేశ్వరి. నవ్యాంధ్రలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం 65 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు నలబోతు వెంకట్రావు అధ్యక్షతన జరిగిన వికాస్‌పర్వ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

రూ. 20 వేల కోట్ల రాజధాని ఔటర్ రింగ్‌రోడ్డుకు, దుర్గమ్మ గుడి బ్రిడ్జి, బెంజి సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఆంధ్రా-రాయలసీమకు అనుసంధానం చేసే రోడ్లుకు ఈ నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. గతంలో రైల్వేకు సంబంధించిన ఫైళ్ళు ఎనిమిది నెలలపాటు పట్టేదని, బీజేపీ పాలనలో 80 రోజుల్లో ఫైళ్ళు క్లియర్ అవుతున్నాయని అన్నారు.

నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, ఆర్థికలోటు, పోలవరం నిర్మాణం ప్రధాన అంశాలుగా ఉన్నాయని అన్నారు. ప్రత్యేక హోదాకు దీటుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి డిపిఆర్ లేకుండా కేంద్రం ఎలా సహకరిస్తుందని ప్రశ్నించారు. డిపిఆర్ నివేదిక ఉంటే కేంద్రం తప్పనిసరిగా సహకరిస్తుందని పురంధ్రీశ్వరి స్పష్టం చేశారు.

Purandeswari on centre help to Andhra Pradesh

ఆర్థికలోటు ఏడువేల కోట్లు ఉంటే ఇప్పటికే 6,034 కోట్ల రూపాయలను కేంద్రం అందించిందన్నారు. పోలవరం నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో మిగిలిన ఏడు మండలాలను ఆంధ్రాలో విలీనం చేయడం వల్లనే పోలవరం సాధ్యం కానుందన్నారు.

ఇప్పటివరకు పోలవరం నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం 2,334 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిందని, పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమా? కాదా? అనేది స్పష్టం చేయాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖామంత్రి విరుద్ధ ప్రకటనలు చేశారని అన్నారు.

భూసేకరణ తదితర అంశాలకు సంబంధించి వివరాలు కేంద్రానికి ఇస్తే రీయింబర్స్‌మెంట్ వస్తుందని స్పష్టం చేశారు. నాబార్డు ద్వారా వచ్చే నాలుగువేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అవినీతి రహిత పాలన బీజేపీ లక్ష్యమని అన్నారు. బీజేపీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయికి చేరుకోవాలన్నారు.

English summary
BJP leader Purandeswari on Wednesday explained about centre help to Andhra Pradesh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X