అనివార్యం, సీమాంధ్ర కోసం పోరాడాలి: టిపై పురంధేశ్వరి

ప్రముఖ తెలుగు ఛానల్ ఎన్టీవి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో విభజన అనివార్యంగా కనిపిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంత హక్కుల కోసం పోరాడాలన్నారు. తాము సీమాంధ్ర హక్కుల కోసం పోరాడుతుంటే ద్రోహులుగా చిత్రీకరించడం సరికాదన్నారు.
తానుండగా విభజన జరగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం అది ఆయన అభిప్రాయమన్నారు. కేంద్రం తెలంగాణపై ముందుకు వెళ్తున్న తరుణంలో సీమాంధ్ర ప్రాంతం నష్టపోకుండా ఏం చేయాలో ఆలోచించాలన్నారు.
నీటి సమస్యలు, విద్యావకాశాల విషయంలో ప్రజలకు భయాందోళనలు ఉన్నాయని చెప్పారు. తాము అధిష్టానం తీరు వల్లనే రాజీనామా చేశామని చెప్పారు. విభజనపై ఇంత జరుగుతున్న ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. తాను సమైక్యవాదినని అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర హక్కుల కోసం పోరాడాల్సి ఉందన్నారు.
రాజీనామాలపై మిగిలిన ఎంపిల నిర్ణయం వారి వ్యక్తిగతమన్నారు. విభజన విషయంలో సిపిఎం, మజ్లిస్ మినహా అన్ని పార్టీలు ముద్దాయిలే అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఎపిఎన్జీవోలకు తమ మద్దతు ఉంటుందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలు ఇప్పుడు నీరుగారిపోయాయని చెప్పారు.












Click it and Unblock the Notifications