చెబితే టిడిపికి ప్రచారానికి పురంధేశ్వరి సై, జగన్ ఆగ్రహం

హైదరాబాద్: తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ సీమాంధ్ర ప్రచార సారథి దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం చెప్పారు. టిడిపి, బిజెపిల మధ్య పొత్తు కుదిరితే.. టిడిపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలని ఆదేశాలు వస్తే అందుకు సిద్ధమన్నారు.

చంద్రబాబుపై జగన్ ఫైర్

అధికారం చేజిక్కించుకోవడమే ధ్యేయంగా ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును జైలులో పెట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం వేరుగా అన్నారు. విశాఖ జిల్లా తగరపువలస కూడలి వద్ద జరిగిన జనభేరి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం లక్షా ఇరవై వేల కోట్లు అయితే ఆయన లక్షా నలభై వేల కోట్ల రూపాయాల రుణాలను ఎలా మాఫీ చేయగలరని ప్రశ్నించారు.

ఇంటికొకరికి చొప్పున ఉద్యోగం ఎలా ఇవ్వగలరని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తాను అధికారంలోకి వస్తే మహిళల అభ్యున్నతికి తొలి సంతకం చేస్తానన్నారు. జగన్ సమక్షంలో భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రిసీతారాం, మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు పార్టీలో చేరారు.

 Purandeswari ready to campaign TDP

ఎలమంచిలిలో జగన్ నిర్వహించిన రోడ్‌షోలో దారిపొడవునా వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు వారి కష్టాలను జగన్‌కు చెప్పుకొన్నారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం ఏర్పడితే కష్టాలు తీరుస్తానని జగన్ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు.

మరోవైపు, కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ అమలుకాని హామీలు ఇస్తున్నారన్నారు. వ్యవసాయ రుణాలను కేంద్ర ప్రభుత్వం మాత్రమే మాఫీ చేయగలదన్నారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసినట్లు చంద్రబాబు చెబుతున్నాడని, వినేవాళ్లు ఉంటే చార్మినార్, హుస్సేన్‌సాగర్ కూడా తానే కట్టించానని చెబుతారని ఎద్దేవా చేశారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో షర్మిల భారీ రోడ్‌షో నిర్వహించారు. చంద్రబాబును మించిన సైకో, శాడిస్టు రాష్ట్రంలో మరొకరు లేరని ఆమె ధ్వజమెత్తారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, చెప్పులు వేయించిన శాడిస్టు బాబు అని అన్నారు. జీతాల కోసం ఉద్యమించిన అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన సైకో అని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+