జగన్ పార్టీలోకి 'ముద్దమందారం' ముద్దుగుమ్మ, బాబు
విశాఖ/హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, ముద్ద మందారం కథానాయిక పూర్ణిమ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ముద్దమందారం, శ్రీవారికి ప్రేమలేఖ తదితర చిత్రాల్లో ఆమె నటించారు. విశాఖపట్నం ఎంవిపి కాలనీలోని పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే తనకు అభిమానమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు.
జగన్ పార్టీలోకి సికె బాబు
కాంగ్రెసు పార్టీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు, చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు, చలన చిత్ర దర్శకుడు ఎ కోదండరామి రెడ్డి బుధవారం లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. సికె బాబు... జగన్, విజయమ్మల ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

పూర్ణిమ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే తనకు అభిమానమని పూర్ణిమ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు.

సికె బాబు
కాంగ్రెసు పార్టీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు, చిత్తూరు ఎమ్మెల్యే సికె బాబు, చలన చిత్ర దర్శకుడు ఎ కోదండరామి రెడ్డి బుధవారం లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

కారుమూరి
చిత్తూరు జిల్లా కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు సికె బాబు... పార్టీ అధ్యక్షులు జగన్, గౌరవాధ్యక్షురాలు విజయమ్మల ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సీమాంధ్రలో జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తూ వారు ఆ పార్టీలో చేరందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.












Click it and Unblock the Notifications