తెలుగు సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం: షూటింగ్ ఎక్కడంటే..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పాముల నారాయణమూర్తి పుష్ప శ్రీవాణి ఓ సినిమాలో నటిస్తున్నారు. మంత్రిగా పనిచేస్తూనే ఆ సినిమా షూటింగ్ కోసం తన సమయాన్ని కేటాయిస్తున్నారు. సందేశాత్మక చిత్రం కావడంతో ఆమె ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
Petition on Hrc: రాజ్‌భవన్ స్కూల్‌పై బాలల హక్కుల సంఘం ఫిర్యాదు

ఏ పాత్రలో తెలుసా..?
గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న పుష్ప శ్రీవాణి ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను తెలిపేలా తెరకెక్కిస్తున్న ‘అమృత భూమి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె టీచర్ పాత్రలో కనిపించనున్నారు.

గొరడ గ్రామంలో షూటింగ్..
ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో జరిగిన సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని లోవముఠా ప్రాంతం గొరడ గ్రామంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

పాఠశాల ఆవరణలో..
గొరడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయురాలిగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిపై ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు.

ప్రకృతి వ్యవసాయం..
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా సినిమా రూపొందిస్తుండటం అభినందించదగ్గ విషయమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, మరో అధికారి పాత్రలో కలెక్టర్ హరిజవహర్ లాల్ కూడా నటిస్తుండటం గమనార్హం.

అందుకే ఈ సినిమా..
రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్యర్చాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. పుష్ప శ్రీవాణితోపాటు పలువురు నటీనటులు ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications