పుదీనా ఆకులను కరివేపాకుల్లా తీసేయొద్దు.. అర్థమైందా?
పుదీనా లేకుండా బిర్యానీ వండరు.. పుదీనా లేకుండా లెమన్ టీ ఉండదు.. ఏ పదార్థానికైనా మంచి సువాసన ఇచ్చే పుదీనావల్ల అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. పుదీనాలో ఉండే మెంతోల్ చల్లటి అనుభూతిని కలిగిస్తుంది. వాయుమార్గాలను తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అసలు పుదీనావల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
పుదీనా ఆకుల్లో మనిషికి విశ్రాంతిని కలిగించే లక్షణాలుంటాయి. వీటిద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తక్షణమే విశ్రాంతిని కలిగించే రా థెరపీలో ఉపయోగిస్తారు. పుదీనా ఆకు వాసన చూసినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వర్షాలు ఒకవైపు, వాతావరణం చల్లదనం మరోపక్క ఉండటంవల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు లాంటివి తరుచుగా వస్తున్నాయి. ఈ సమస్య తగ్గాలంటే పుదీనా బాగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఒక కప్పు పదీనా టీని తాగాలి. గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

పీరియడ్స్ సమయంలో చాలామంది భరించలేని తిమ్మిరితో బాధపడుతుంటారు. అటువంటివారికి పుదీనా ఎంతో మేలు చేస్తుంది. కండరాలను శాంతపరుస్తుంది. అంతేకాదు.. యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు ఎక్కువ. రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియకు పుదీనా ఆకులు ఎంతో తోడ్పడతాయి. కడుపు సమస్యలను తగ్గిస్తాయి. పుదీనాలో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మెంతోల్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ పనితీరును ఇవి మెరుగుపరచడమే కాకుండా కడుపునకు సంబంధించిన అన్ని సమస్యలను వెంటనే తగ్గిస్తుంది.












Click it and Unblock the Notifications