అమరావతిలో చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్- ఇంకొన్ని గంటల్లో.. !!
అమరావతిలో చారిత్రక ఘట్టానికి ఇంకొన్ని గంటల్లో తెర లేవబోతోంది. రాజధాని నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో భారీ ప్రాజెక్ట్ కు నేడు తొలి అడుగు పడబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి డ్రీమ్ ప్రాజెక్ట్ అది. దీనికి స్వయానా ఆయనే శంకుస్థాపన చేయనున్నారు. భూమిపూజలతో శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రపంచ టెక్ రంగంలో అమరావతి చిరస్థాయిగా నిలిచిపోతుంది.
అదే- క్వాంటమ్ వ్యాలీ. అమరావతి క్వాంటమ్ వ్యాలీ (Amaravati Quantum Valley) భవన నిర్మాణానికి చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ దీనికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఈ భవనం నిర్మితం కానుంది. దీని కోసం ఇదివరకే ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రివర్గం సైతం ఆమోదం తెలిపింది గతంలో.

ఈ మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. 2: 45 నిమిలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 3 గంటలకు ఉద్దండరాయునిపాలెం చేరుకుంటారు. జితేంద్ర సింగ్ సమక్షంలో శంకుస్థాపన చేస్తారు. క్వాంటమ్ కంప్యూటర్ ప్రాజెక్ట్ లో- దేశీయ దిగ్గజ టెక్ కంపెనీలు ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్ టీ కీలకంగా వ్యవహరిస్తోన్నాయి. వీటితో ప్రభుత్వం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
We are ready to move from positioning India as an IT leader in the late 1990s to superpositioning India as a quantum leader - right here in #Amaravati. A big day tomorrow!
— N Chandrababu Naidu (@ncbn) February 6, 2026
అమరావతి క్వాంటమ్ వ్యాలీ లోగో ఆవిష్కరణ, విజేతలకు బహుమతి ప్రకటించడం, ఐబీఎం, టీసీఎస్ క్వాంటమ్ క్లౌడ్ సేవల ప్రారంభం వంటివి ఈ వేడుకలో ముఖ్యాంశాలుగా నిలువనున్నాయి. అలాగే ఈ రంగంలో అవగాహన ఒప్పందాల ఒప్పందాలు కుదరనున్నాయి. ఐబీఎం- టీసీఎస్ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్, క్వాంటమ్ టాలెంట్ హబ్, ఎస్ఆర్ఎం యూనివర్శిటీ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ వంటి సంస్థాగత సహకారాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
-
Mavigun Vs Amaravati: అమరావతి కంటే మావిగాన్ ఎలా బెటర్ ? అంబటి వివరణ..! -
శూన్యం నుంచి సృష్టి వరకు.. చరిత్ర నిన్ను క్షమించదు జగన్ -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!











Click it and Unblock the Notifications