లడేంగే.. నినాదం చల్లారినట్టేనా! పాలిటిక్స్ కు కామా, కాటమరాయుడితో బిజీ!?
విజయవాడ : లడేంగే లడేంగే.. అని తిరుపతి సభలో అంతెత్తున నినదించిన పవన్.. కాకినాడ సభకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా సీన్ ను మార్చేశారు. ఎంపీలంతా ఉండగా.. మనమెందుకు పోరాటం చేయాలంటూ ఓ ప్రశ్నను లేవనెత్తారు. బంద్ పై జనాలను డైలామాలో పెట్టి విపక్షాలతో పరోక్షంగా విబేధించారు.
తిరుపతి సభలో ఓ మాట.. కాకినాడ సభలో ఓ మాటతో రెండు సభలకే తన స్టాండ్ మార్చేసిన పవన్ ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితి అభిమానులది. పోరాడాల్సిన వాళ్లు.. చేతులెత్తేశాక తాను పిడికిలి ఎత్తుతానంటూ చెప్పిన పవన్ వ్యాఖ్యలను ఏవిధంగా సమర్థించుకోవాలో జనసేన సైనికులకు సైతం పాలుపోవడం లేదు.
హోదా సంగతి పక్కకుపోయి ప్యాకేజీ తెరమీదకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని పట్ల సుముఖంగానే ఉంది. కేంద్రంతో గొడవలు రాష్ట్రానికి మేలు చేకూర్చువనేది ప్రభుత్వ వాదన. అంటే.. కేంద్రంతో పేచీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగాను సిద్దంగా లేదు. ఇంత స్పష్టంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంటే.. ఎంపీలు హోదాపై పోరాడండి, మీవల్ల కాకపోతే నేను బరిలోకి దిగుతానంటూ పవన్ చేసిన కామెంట్స్ ను ఎలా చూడాలనేది అంతు చిక్కని ప్రశ్న.

మూడంచెల కార్యచరణతో జనంలోకి వెళ్లి పోరాటం చేస్తా అన్న పవన్.. తిరుపతి సభతోనే ప్యాకప్ చెప్పేశారన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అటు జనాన్ని పోరాడనివ్వకుండా.. తాను రోడ్డు పైకి రాకుండా.. ఇంకా వేచి చూసే ధోరణిని ఏ రకమైన వ్యూహాం అనాలో తెలియక ఏపీ ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ఇప్పటికే హోదా హీట్ కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. ఇంకొంత కాలం పోతే ఆ ఊసే ఉండకపోవచ్చు.
అప్పటిదాకా పవన్ మళ్లీ తెరపైకి వస్తారా? రారా? అన్నది తెలియదు. ఎంపీలు పోరాటం చేయాలని నిలదీశాడే తప్పించి దానికో డెడ్ లైన్ అంటూ ఏమి ప్రకటించలేదు. ఇలాంటి తరుణంలో.. పవన్ మళ్లీ ఎప్పుడు రంగంలోకి దిగుతారు..? హోదాపై ఆయన పోరాటం ఇక్కడితో ముగిసినట్టేనా..? అన్న ప్రశ్నలు జనం మెదళ్లకు వేలాడుతున్నాయి. ఏక వ్యక్తి నియంత్రణలో సాగుతోన్న పార్టీ కావడంతో.. దీనిపై వివరణ ఇచ్చేదెవరో కూడా తెలియని పరిస్థితి.
ఇదంతా ఇలా ఉంటే.. పవన్ తన పోరాటానికి పాలిటిక్స్ కు కామా పెట్టేసి 'కాటమరాయుడు' షూటింగ్ పై ఫోకస్ చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయనపై చాలానే సెటైర్లు వినిపిస్తుండడం గమనార్హం. ఉద్యమమని ఊరడించి.. ఊగిపోయే స్పీచులిచ్చి.. ఇప్పుడేమో చడీ చప్పుడు లేకుండా షూటింగ్ కు వెళ్లి హాయిగా సినిమా చేసేసుకుంటాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications