ప్రశ్న: 'రామ్‌నాథ్ కోవింద్ కాళ్లకు జగన్ మొక్కవచ్చా?', బిజెపికి మద్దతుపై ట్విస్ట్

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తమ పార్టీ అధినేత జగన్ పాదాభివందనం చేస్తే తప్పేమిటని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం ప్రశ్నించారు.

అమరావతి: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తమ పార్టీ అధినేత జగన్ పాదాభివందనం చేస్తే తప్పేమిటని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం ప్రశ్నించారు.

మన కంటే వయసులో పెద్దవారికి నమస్కరించడం మన సంప్రదాయమని చెప్పారు. కోవింద్‌కు జగన్ పాదాభివందనం చేయడాన్ని తప్పుగా చిత్రీకరించడం సబబు కాదని అన్నారు.

తాము మద్దతు ఇస్తోంది ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కే తప్పా, బిజెపికి కాదని ట్విస్ట్ ఇచ్చారు. హెరిటేజ్ వాహనంలో తరలించిన ఎర్రచందనం దుంగల అంశాన్ని అంబటి ప్రస్తావించారు.

Questions on YS Jagan touch Ramnath Kovind's legs

ఈ వ్యవహారంపై మంత్రులు ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆ వాహనాన్ని పట్టుకుంది తమ పార్టీ కార్యకర్తలు కాదని, టాస్క్‌ఫోర్స్ పోలీసులేనన్న విషయాన్ని టిడిపి నేతలు గ్రహించాలన్నారు.

అంతకుముందు, హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు కోవింద్ కాళ్లకు జగన్ మొక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిస్టియన్లను దూషించిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్‌కు జగన్ కాళ్లు మొక్కవచ్చా అని ప్రశ్నించారు.

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో ఫోటోలు దిగారని దళిత ఎమ్మమెల్యేలను తిడతారా అని నిలదీశారు. సోనియా గాంధీ కుట్రతో జగన్‌ను కేసులో ఇరికించారన్న భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను విహెచ్ ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+