'రాజమౌళికి హ్యాట్సాప్ కానీ, బాహుబలికి అవార్డు ఇచ్చినప్పుడే వాటిపై నమ్మకం పోయింది'
నంది అవార్డుల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. నంది అవార్డులు ఓ సామాజిక వర్గానికే ఎక్కవ ఇచ్చారని కొందరు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలోను ఈ అవార్డులపై దుమారం రేగుతోంది.
అమరావతి/హైదరాబాద్: నంది అవార్డుల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. నంది అవార్డులు ఓ సామాజిక వర్గానికే ఎక్కవ ఇచ్చారని కొందరు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలోను ఈ అవార్డులపై దుమారం రేగుతోంది.
చదవండి: అవార్డుల వివాదం: ప్రశ్నించినందుకు 'నంది' ఇవ్వలేదా, బాబు-బాలయ్యలపై 'కమ్మ' వివాదం

లెజెండ్‌కు అవార్డులు మొదలు
అవార్డులపై సినీ ప్రముఖులు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు. లెజెండ్ సినిమాకు ఎక్కువ అవార్డులు రావడంపై విమర్శలు తొలుత ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇది చినికి చినిగి వాన అయింది. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు.

ఆర్ నారాయణ మూర్తి ఆగ్రహం
నంది అవార్డులు కమ్మ అవార్డులుగా కనిపిస్తున్నాయని, ఓ సామాజిక వర్గానికే ఎక్కువ ఇచ్చారని, రుద్రమదేవి రాయితీ గురించి నిలదీసినందుకే నంది రాలేదని ఇలా గుణశేఖర్ సహా పలువురు నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక, నిర్మాత, హీరో ఆర్ నారాయణ మూర్తి ఈ వివాదంపై స్పందించారు.

అవార్డులు ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారిపోయాయి
రుద్రమదేవి సినిమాకు నంది రావాల్సి ఉండెనని ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. దేశానికి ఝాన్సీలక్ష్మీబాయి ఎలాగే, మన తెలుగు జాతికి రుద్రమదేవి అలా అన్నారు. సంస్కృతికి, సంప్రదాయాలకు పట్టంకట్టేలా గతంలో అవార్డులు ఇచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అవార్డులు ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారిపోయాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళికి హ్యాట్సాప్, కానీ అప్పుడే అవార్డులపై తేలిపోయింది
బాహుబలి సినిమాతో టాలీవుడ్‌ను అంతర్జాతీయస్థాయికి తీసుకు వెళ్లిన రాజమౌళికి హ్యాట్సాప్ అన్నారు. అదే సమయంలో ఆయన బాహుబలికి అవార్డు ఇవ్వడంపై మరోలా స్పందించారు. బాహుబలి సినిమాకు జాతీయ ఉత్తమ అవార్డు వచ్చినప్పుడే పూర్తి కమర్షియల్ చిత్రాలకు అవి వస్తున్నాయని మరోసారి తెలిసిపోయిందని, అప్పుడే తనకు అవార్డులపై నమ్మకం పోయిందన్నారు.












Click it and Unblock the Notifications