అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనంత మెడికల్ కాలేజీలో బట్టలు విప్పించి ర్యాంగింగ్..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అనంతపురం: కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. అనంపురం నగరంలోని మెడికల్ కాలేజీలో ర్యాంగింగ్ భూతం ఘటన వెలుగులోకి వచ్చింది. కాలేజీలోని జూనియర్లపై గత అర్దరాత్రి సీనియర్ విద్యార్దులు హద్దు మీరి ప్రవర్తించారు.

దుస్తులు విప్పి మరీ నృత్యాలు చేయాలంటూ వారు జారీ చేసిన ఆదేశాలను జూనియర్లు తిరస్కరించారు. దీంతో మరింత రెచ్చిపోయిన సీనియర్లు జూనియర్లపై దాడి చేసి బలవంతంగా వారి దుస్తులు విప్పదీయించి డ్యాన్సులు చేయించారు. దీంతో మరింత రెచ్చిపోయిన సీనియర్లు జూనియర్లపై దాడి చేసి బలవంతంగా వారి దుస్తులు విప్పదీయించి డ్యాన్సులు చేయించారు.

Ragging in Anantapur medical college

బాధిత విద్యార్దులు
ర్యాంగింగ్‌పై సహాచర విద్యార్దులకు ర్యాంగింగ్ పై సమాచారం అందించడంతో.. జూనియర్ విద్యార్దులంతా కలసి ర్యాంగింగ్ చేసిన నలుగురు సీనియర్ విద్యార్దులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ర్యాంగింగ్‌పై జూనియర్ విద్యార్దులు మెడికల్ కాలేజీ ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఐతే విషయం బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్న కళాశాల ఉన్నతాధికారులు సీనియర్లు, జూనియర్ల మధ్యన రాజీ కుదిర్చే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ర్యాగింగ్ పై ఇప్పటిదాకా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

English summary
Ragging in Anantapur medical college. Senior students was participated in this ragging.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X