నగ్నంగా రన్, కౌగిలింత: కాలేజీలో ర్యాగింగ్ భూతం

విద్యార్థుల దుస్తులు విప్పించి నగ్నంగా హాస్టల్ వరండాలో పరుగులు తీయించడం, ఒకరినొకరు కౌగలించుకోవాలని చెప్పడం వంటి దారుణ పద్ధతుల్లో ర్యాగింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై జూనియర్ విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది.
ర్యాగింగ్‌ను తట్టుకోలేక పలువురు విద్యార్థులు నగరంలోని తమ బంధువుల ఇళ్లకు వెళ్లగా, మరికొంతమంది లాడ్జిలలో ఉంటున్నారని సమాచారం.
ర్యాగింగ్ బారిన పడిన కడప జిల్లాకు చెందిన ఓ విద్యార్థి గురువారం నేరుగా జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎస్పీ గురువారం రాత్రి కళాశాల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులను పరిశీలించారు. హాస్టల్‌లో ర్యాగింగ్ జరుగుతున్న తీరును జూనియర్లు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో విద్యార్థులను సమావేశ పరిచిన ఎస్పీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications