నా కోరిక: టీటీడీ చైర్మన్ రేసులో రాఘవేంద్రరావు, ఏమన్నారంటే, ఇరకాటంలో బాబు
హైదరాబాద్/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ రేసులో మరో పేరు తెరపైకి వచ్చింది. ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు ఈ రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే పుట్టా సుధాకర్ యాదవ్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే, ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పేరు కూడా తెరపైకి రావడం గమనార్హం. రాఘవేంద్ర రావును త్వరలో చైర్మన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోందని, ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ సన్నిహత వర్గాలు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

రాఘవేంద్ర రావు నియామకం దిశగా అంటూ
అంతేకాదు, ఇటీవల రాఘవేంద్ర రావుతో అధికారులు భేటీ అయ్యారని, చైర్మన్‌గా నియమించే విషయమై ప్రాసెస్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారని వార్తలు వచ్చాయి. రాఘవేంద్ర రావు 2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు.
Recommended Video


భక్తి సినిమాలు తీశారు
రాఘవేంద్ర రావుకు టీటీడీ బోర్డు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారంపై దర్శకులు గీతా కృష్ణ కూడా స్పందించారని పేర్కొన్నారు. రాఘవేంద్ర రావు ఎన్నో భక్తి సినిమాలు తీశారని, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పైన తీశారని, ఇలాంటి వ్యక్తిని చైర్మన్ చేయడం ఆశ్చర్యం ఏమీ కాదని అభిప్రాయపడ్డారు.

రాఘవేంద్ర రావు స్పందన
ఆయన టీటీడీ చైర్మన్ అవుతున్నారంటూ సోషల్ మీడియాలోను పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై దర్శకులు రాఘవేంద్ర రావు స్పందించారు. ఈ వార్తలు రావడాన్ని ఆయన ఖండించారు.

అదే నా కోరిక
సోషల్ మీడియాలో ఇలా పోస్టులు ఎందుకు పెడుతున్నారో తనకు అర్థం కావడం లేదని రాఘవేంద్ర రావు అన్నారు. సీఎం చంద్రబాబు తనకు శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారని, వాటిని సక్రమంగా నిర్వహిస్తున్నానని, ఛానల్లో మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలన్నదే తన కోరిక అన్నారు.

బాబును ఇరకాటంలో పడేసింది
టీటీడీ చైర్మన్ పదవిపై చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై రాయపాటి సాంబశివ రావు, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు ఎందరో ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రజాప్రతినిధులుగా ఉన్న వారికి నామినేటెడ్ పోస్టులు లేవని తేల్చి చెప్పారు. దీంతో రాయపాటి ఆశలు నీరుగారిపోయాయి. ఆ తర్వాత పుట్టా పేరు బాగా వినిపించింది. దాదాపు ఆయనను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది రేసులో ఉండటంతో ఈ పదవి చంద్రబాబును ఇరకాటంలో పెడుతోంది.












Click it and Unblock the Notifications