రాఘవులు కరచాలనం: ఎత్తేసిన పోలీసులు (ఫొటోలు)
హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్మికులు అసెంబ్లీ ముట్టడికి పూనుకుంటే ముందుండి నడిపిస్తూ, వారి వెన్నంటే ఉంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి. రాఘవులు అన్నారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల చర్చలకు పిలిచి సంమస్యలను పరిష్కరించాలని లేని ఎడల ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బుధవారం మున్సిపల్ కార్మికులు చేపట్టిన జిహెచ్‌ఎమ్‌సి ముట్టడి కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. మున్సిపల్ కార్మికుల్లో దళితులు, బలహీన వర్గాల వారే అత్యధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వారిపై వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడంతో కార్మికులు సమ్మెను ఉధృతం చేయాలని నిశ్చయించుకున్నారని పేర్కొన్నారు.
ఉద్యోగులందరికీ ఇస్తున్నట్లే మున్సిపల్ కార్మికులకు కూడా ఐఆర్ 27శాతం, హెల్త్ కార్డుల మంజూరు చేసి, డిఎ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్మా ప్రయోగించి ఉద్యమాలను ఆపడం సాధ్యం కాదన్నారు. వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

పోలీసులు ఎత్తేశారు..
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) మహిళా ఉద్యోగిని ఇలా మహిళ పోలీసులు ఎత్తేశారు.

అంగన్‌వాడీ కార్యకర్తలకు రాఘవులు భరోసా
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు తన సంఘీభావాన్ని తెలిపారు.

రాఘవులు విమర్శ
మున్సిపల్ కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని రాఘవులు విమర్శించారు.

జిహెచ్‌ఎంసి వద్ద ఆందోళన
జిహెచ్‌ఎంసి ముట్టడి కార్యక్రమానికి సిపిఎం అనుబంధ కార్మిక సంఘం సిఐటియు మద్దతు పలికింది. ఇలా సిఐటియు కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications