మళ్లీ అలా చేస్తే చంపేస్తారట: వైసీపీ ఎంపీ మాధవ్‌పై ప్రధాని, స్పీకర్‌కు రఘురామ ఫిర్యాదు
న్యూఢిల్లీ: వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులపై ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఫిర్యాదు చేశారు. తాను టీవీల్లో కనిపిస్తే చంపేస్తామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనను బెదిరించారని ప్రధాని నరేంద్ర మోడీకి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు.

చంపేస్తానని ఎంపీ మాధవ్ బెదరించారు: రఘురామ
మంగళవారం ఉదయం 11.50 గంటలకు లోక్‌సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉన్న తన దగ్గరకు వచ్చిన ఎంపీ మాధవ్ అసభ్య పదజాలంతో దూషించారని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు. అంతేగా, మరోసారి టీవీల్లో కనిపిస్తే అంతం చేస్తామని బెదిరించారని తెలిపారు.

మాధవ్‌ను రెచ్చగొట్టి పంపారు.. సీసీటీవీ ఫుటేజీ చూస్తే..
తన దగ్గరకు రావడానికి ముందు మాధవ్, వైసీపీ ఎంపీలదగ్గర కూర్చున్నారని చెప్పారు. బహుశా వాళ్లు రెచ్చగొట్టడం వల్లే అలా చేసి ఉంటారని తెలిపారు. పార్లమెంటు సెంట్రల్ హాలులోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే తనను బెదరించే దృశ్యాలు కనిపిస్తాయన్నారు. సభా నాయకుడిగా ఉన్న ప్రధాని దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధానిని రఘురామ కోరారు.

సీఎం జగన్‌కు మాధవ్ సన్నిహితుడు.. చర్యలు తీసుకోండి..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ మాధవ్ సన్నిహితుడైన ఎంపీ మాధవ్ బెదిరించారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని ప్రధానికి రఘురామ విజ్ఞప్తి చేశారు. ఆలస్యం చేయకుండా మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో రఘురామ కోరారు.
Recommended Video

ఉపాధి నిధులను మళ్లించిన ఏపీ సర్కారు: రఘురామ
మరోవైపు, కేంద్రం విడుదల చేసిన ఉపాధి నిధులను ఇతర పథకాలకు మళ్లించారని ప్రజలు అభిప్రాయపడుతున్నారని, ఈ విషయంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు విచారణ జరిపించాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు రాసిన లేఖలో రఘురామ కృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. 2018-19లో కేంద్రం నిధులు విడుదల చేసినా.. రాజకీయ కారణాలతో విజిలెన్స్ విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు నిలిపేసిందని పేర్కొన్నారు. మొత్తం రూ. 1800లు చెల్లించాల్సి ఉండగా హైకోర్టు జోక్యంతో గత వారం కేవలం రూ. 28 కోట్లే చెల్లించిందని తెలిపారు. ఏపీకి ఇచ్చిన నిధులను రాబట్టి నేరుగా కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని రఘురామ తన లేఖలో కోరారు.












Click it and Unblock the Notifications