ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీకి కుట్ర, కేపీరెడ్డి పాత్రపై విచారణ: రాజ్‌నాథ్‌కు రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు
హైదరాబాద్: వైయస్సార్సీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆదివారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్‌ను ఆయన నివాసంలో కలిశారు. సుమారు 20 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. తనను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్ చేయడానికి దాని రిజిస్ట్రార్ పీకే రెడ్డి డాక్టర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఈ సందర్భంగా రఘురామ రక్షణమంత్రికి ఫిర్యాదు చేశారు.

ఆ ముగ్గురు కుట్ర చేశారన్న రఘురామ..
టీటీడీ జేఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డితో కలిసి కేశవరెడ్డి కుట్రపన్ని తనను ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయించి, ఆ వెంటనే పోలీసులు పట్టుకుకుని ఏపీకి పట్టుకుపోయేలా ఎత్తులు వేశారని కేంద్రమంత్రికి ఇచ్చిన ఫిర్యాదు లేఖలో రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. అరెస్ట్, ఆస్పత్రి వద్ద జరిగిన పరిణామాలపై వివరించారు.

నన్ను డిశ్చార్జ్ చేసేందుకు కేపీరెడ్డిపై ధర్మారెడ్డి ఒత్తిడి: రఘురామ
తాను వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కేపీరెడ్డి అక్కడ ఆస్పత్రి రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షల కోసం తనను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించిన మరుసటి రోజే టీటీడీ అదనపు జేఈవోగా వ్యవహరిస్తున్న డిఫెన్స్ అకౌంట్స్ అండ్ ఆడిట్ సర్వీస్ అధికారి అయిన ధర్మారెడ్డి డిప్యూటేషన్ మీద 18వ తేదీన తిరుపతి నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు తనకు తెలిసిందని రఘురామ పేర్కొన్నారు. ఆ తర్వాత తనను ఆస్పత్రి నుంచి సాధ్యమైనంత త్వరగా డిశ్చార్జి చేయాలని కేపీరెడ్డిపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఈ క్రమంలో కేపీరెడ్డి తనను మే 24నే డిశ్చార్జీ చేయాలని డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారన్నారు.

15 మంది పోలీసులతో గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి ఆస్పత్రి వద్దనే..
కానీ, మరో రెండు రోజులు వైద్య చికిత్స కొనసాగించాలన్న తన అభ్యర్థన మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్ల అంతిమంగా మే 26న తనను డిశ్చార్జ్ చేశారని రఘురామ వెల్లడించారు. అయితే, కేపీరెడ్డి, ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి కుమ్మక్కై 15 మంది పోలీసులు మూడు వాహనాలతో మిలిటరీ ఆస్పత్రి వద్ద మోహరించారని తెలిపారు. తనకు సుప్రీంకోర్టు విస్తృత బెయిల్ ఇచ్చినప్పటికీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే పట్టుకుపోవాలని కుట్రపన్నారని చెప్పారు. పోలీసుల మోహరింపు గురించి ఆరా తీసినప్పుడు ఈ కుట్ర గురించి తనకు తెలిసిందని రఘురామ తెలిపారు.

కేపీరెడ్డి పాత్రపై, తనకు వ్యతిరేక కుట్రపై దర్యాప్తు చేయాలంటూ రఘురామ
ఈ లేఖతోపాటు ఏపీ పోలీసు శాఖకు చెందిన 15 మందికి చెల్లించిన మెస్ బిల్లు జత చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కేపీరెడ్డి పాత్రపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ను రఘురామ కోరారు. ఆయనకు సంబంధించిన కాల్ డేటా రికార్డును పరిశీలించి తనకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాగస్వాములైన ఇతరులను గుర్తించి, మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరుపాలని రఘురామ కేంద్రమంత్రిని కోరారు.
Recommended Video
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications