రఘురామకు చంద్రబాబు కీలక పదవి - కోరుకున్నదే..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కు పదవి ఖరారు చేసారు. రఘురామ కోరుకున్న విధంగానే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. మండలి, అసెంబ్లీలో కూటమి నుంచి చీఫ్ విప్, విప్ పదవులు ప్రకటించారు. అదే సమయంలో కొద్ది రోజులుగా చర్చలో ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి పైనా నిర్ణయం తీసుకున్నారు. ఇక, రఘురామ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
డిప్యూటీ స్పీకర్ గా
మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామ కోరుకున్న విధంగా అధ్యక్షా అని పిలిపించుకోను న్నారు. రఘురామ కోరుకున్న విధంగా చంద్రబాబు ఆయనకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ మండలిలో పాటుగా అసెంబ్లీలోనూ పార్టీ చీఫ్ విప్.. అదే విధంగా కూటమి నుంచి విప్ లను అధికారికంగా ఖరారు చేసారు. ఇక, స్పీకర్ గా ఉత్తరాంధ్రకు చెందిన అయ్యన్న పాత్రుడు ఉండటంతో డిప్యూటీ స్పీకర్ గా ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ కూటమిలో కొనసాగింది. పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. మూడు పార్టీల నుంచి మూడు ప్రాంతాలకు చెందిన వారిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరిగింది.

ఏకగ్రీవ ఎన్నిక
కసరత్తులో భాగంగా రఘురామకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. చంద్రబాబు మంత్రివర్గంలో క్షత్రియ వర్గానికి అవకాశం దక్కలేదు. దీంతో, టీటీడీ ఛైర్మన్ గా ఆ వర్గానికి అవకాశం ఇస్తారనే చర్చ జరిగింది. కానీ, టీటీడీ బోర్డు ఖరారు కావటంతో.. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా క్షత్రియ వర్గానికి చెందిన రఘురామకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. రఘురామ వైసీపీలో ఎంపీ గా ఉన్న సమయంలో జగన్ తో విభేదించారు. ఆ సమయంలోనే జగన్ పైన విరుచుకుపడే వారు. రఘురామ పైన కేసు..అరెస్ట్ చేసారు. తన పైన సీఐడీ అధికారులు దాడి చేసారని రఘురామ ఫిర్యాదు చేసారు. జగన్ బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. ఇక, టీడీపీలో చేరి ఉండి నుంచి రఘురామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
చంద్రబాబు నిర్ణయంతో
రఘురామకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చే పదవి పైన పలు రకాల చర్చలు తెర మీదకు వచ్చాయి. రఘురామ ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయం నుంచి ఆయనకు స్పీకర్ పదవి కావాలని కోరుకున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో రఘురామకు సభాపతి పదవి ఇవ్వాలని ఆయన మద్దతు దారులు ఆకాంక్షించారు. అయితే, స్పీకర్ గా బీసీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా మంత్రివర్గంలోనూ స్థానం ఆశించినా రఘురామకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు పదవులు ఖరారు వేళ చంద్రబాబు తాజాగా రఘురామకు డిప్యూటీగా ఎంపిక చేసారు. సభలో కూటమికి పూర్తి మెజార్టీ ఉండటంతో రఘురామ ఎంపిక లాంఛనమే. ఈ రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ .. రేపు (గురువారం) ఉప సభాపతిగా రఘురామ ఎన్నిక..బాధ్యతల స్వీకరణ ఉండే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications