RRR: ఉండి సీటుపై రఘురామ మరో ట్విస్ట్- విజయనగరం నుంచి ఆహ్వానం..!
ఏపీలో ఎన్నికల వేళ వైసీపీని వీడి టీడీపీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వచ్చే ఎన్నికల్లో సీటుపై ఇంకా సందిగ్దం వీడలేదు. ఇప్పటివరకూ నరసాపురం సీటులోనూ పోటీ చేస్తానని మంకు పట్టు పట్టిన ఆయన చివరకు తగ్గి ఉండి సీటులో పోటీకి అంగీకరించి టీడీపీలో చేరారు. ఇవాళ ఆయనకు చంద్రబాబు ఉండి సీటు ఖరారు కూడా చేసారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రఘురామ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన రఘురామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న టీడీపీలో చేరానని, అయితే ఉండి సీటు అని తనకు చెప్పలేదని ట్విస్ట్ ఇచ్చారు. ఉండి సీటు అని తనకు చెప్పలేదని, అలాగే రామరాజుకు ఉండి సీటు లేదనీ చెప్పలేదని రఘురామ తెలిపారు. అయితే తన ఆశయం మాత్రం కూటమి అభ్యర్థగా పోటీ చేయడమని ఆయన స్పష్టం చేశారు.
కూటమి తరపున ప్రజాక్షేత్రం లో ఉంటానన్నారు.

ఎక్కడ నుండి పోటీ అనేది తనకు తెలియదని, కానీ ఖచ్చితంగా పోటీలో ఉంటానని రఘురామ వెల్లడించారు. పార్టీ ఆదేశాల మేరకు ఎంఎల్ఏ, ఎంపీ అనేది పార్టీ ఇష్టమన్నారు. తనకు విజయనగరం నుండి ఆహ్వానం వచ్చిందని, ఎక్కడ నుండి అయినా పోటీకి తాను రెడీ అని తెలిపారు. తద్వారా విజయనగరం కూడా తనకు అంగీకారమే అని చెప్పకనే చెప్పేశారు. దీంతో చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications