ఏపీ సీఎం జగన్ కు రఘురామ మరో లేఖాస్త్రం .. అమ్మ ఒడి నాన్న బుడ్డిగా మారిందంటూ ..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. గత తొమ్మిది రోజులుగా వివిధ అంశాలపై జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖలు రాస్తున్నారు. తాజాగా 9 వ రోజు ఆయన ఎన్నికల హామీ అయిన సంపూర్ణ మద్య నిషేధం పై జగన్ కు లేఖ రాశారు.

వరుసగా 9 రోజులుగా లేఖలు రాస్తున్న రఘురామ
తన తొమ్మిదవ లేఖలో రఘురామకృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చారని, అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కావడంలేదని పేర్కొన్నారు. నియంత్రణ కంటే మద్యపాన ప్రోత్సాహమే ఎక్కువ జరుగుతోందని అభిప్రాయపడ్డారు రఘురామకృష్ణంరాజు. ఏపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం హామీకి కట్టుబడి ఉండాలని తన లేఖలో పేర్కొన్న రఘురామకృష్ణంరాజు అమ్మ ఒడికి లింకు పెట్టి మద్యపాన నిషేధం పై కీలక అంశాలు ప్రస్తావించారు.

మద్యనిషేధం టార్గెట్ గా లేఖాస్త్రం
మద్య నిషేధం అమలు చేస్తారన్న హామీతోనే మహిళలు వైసిపికి ఓటేశారని ఆయన పేర్కొన్నారు. మద్యం పైన వచ్చే రాబడిని అమ్మఒడి పథకానికి ఇస్తామని చెప్పారని గుర్తు చేసిన రఘురామకృష్ణంరాజు, ఏపీలో గతేడాదితో పోలిస్తే 16 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయని తెలిపారు. పేద ,మధ్య తరగతి ప్రజలకు భరించలేని విధంగా పన్నులు పెంచారని తన లేఖలో ప్రస్తావించారు. ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి పెట్టిన అమ్మ ఒడి పథకం నాన్న బుడ్డిగా మారిందన్నారు.

అమ్మ ఒడి పథకం ఎందుకు ఉపయోగపడుతుందో చెప్పిన ఎంపీ
అమ్మ ఒడి పథకంలో ఇస్తున్నడబ్బులు, మద్యం ప్రియులు మద్యపానం కోసం ఖర్చు చేస్తున్నట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీకి కట్టుబడి పనిచేయాలని రఘురామ సీఎం జగన్మోహన్ రెడ్డిని తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పిన అనేక పనులపై, వైసిపి ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలపై వరుస లేఖలు రాస్తున్న రఘురామకృష్ణంరాజు, వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు.

ఏపీ సర్కార్ కు కొరకరాని కొయ్యగా మారిన రఘురామ కృష్ణం రాజు
ఏపీ ప్రభుత్వం రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేస్తూ ఎన్ని ప్రయత్నాలు చేస్తునప్పటికీ రఘురామకృష్ణంరాజు ఏపీ సర్కార్ కు కొరకరాని కొయ్యగా మారాడు.నిన్నటికి నిన్న ఏకంగా ప్రదానికే లేఖ రాశారు. ఏపీ అప్పుల్లో కొట్టుమిట్టాడుతుంది అని, స్తోమతకు మించి అప్పులు చెయ్యటమే ఇందుకు కారణం అని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు . ఇదే సమయంలో ప్రభుత్వ ఆస్తులు సైతం తనఖా పెట్టి మరీ అప్పులు చేస్తున్నారని ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications