విష ప్రయోగంలో ఏపీ ప్రభుత్వ హస్తం: విష్ణుని పరామర్శించిన తర్వాత రఘువీరా

అమరావతి: కృష్ణలంకలోని స్వర్ణబార్‌లో జరిగిన విష ప్రయోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్తం ఉందని పీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో అరెస్టైన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లాది విష్ణుని విజయవాడలోని సబ్ జైలులో శనివారం పరామర్శించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. మల్లాది విష్ణుకు పార్టీ తరుపున అండగా ఉంటామని తెలిపారు. మల్లాది విష్ణుకు సంబంధం లేకుండా కల్తీ మద్యం కేసులో ఇరికించారని మండిపడ్డారు.

Raghuveera reddy fires on Ap govt over malladi vishnu

విష్ణుని నష్టపరిచి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం పాలసీలను ఎండగడుతుంటే దానికి సమాధానం చెప్పలేక, అతనిని లోబరచుకోవడానికి అతనికున్న అన్ని వ్యాపారాలపై విజిలెన్స్ చేత దాడులు చేయించారని ఆరోపించారు.

మద్యం కేసులో ఫోరెన్సిక్ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంచినీళ్లలో విషం కలవడం వల్లే అంతమంది చనిపోయారని రఘువీరా అన్నారు. కల్తీ మద్యం ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన శనివారం గుర్తు చేశారు.

కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణుపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత రామచంద్రయ్య పేర్కొన్నారు. రిషితేశ్వకి కేసులో బాబూరావు నిందితుడిని తెలిసినా ఎందుకు అరెస్టు చేయడం లేదని విమర్శించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలాంటి కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

కాగా, కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు అరెస్ట్ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు రఘువీరాతో పాటు కేవీపీ, సీ రామచంద్రయ్యలు శనివారం ఉదయం బెజవాడకు వచ్చారు. దీంతో వారిని మల్లాది విష్ణు మద్దతుదారులు రఘువీరా మందు ఆందోలన చేపట్టారు.

కల్తీ మద్యం కేసును సాకుగా చూపుతూ విజయవాడలో బలమైన నేతగా ఎదుగుతున్న మల్లాది విష్ణును అదికార పార్టీ కుట్రపూరితంగా ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆరోపించారు. అధికార పక్షం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంటే, చూస్తూ ఎలా ఊరుకుంటారని కూడా వారు పార్టీ సీనియర్లపై విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+