పవన్ ఎఫెక్ట్: చిరంజీవి ఫ్యాన్స్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార సారథి చిరంజీవి అభిమానులకు, నాటి ప్రజారాజ్యం పార్టీ నాయకులకు సీమాంధ్ర కాంగ్రెసు ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. నాటి పిఆర్పీ నాయకులు, చిరంజీవి అభిమానులు ఆయా నియోజకవర్గాలలో టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

చిరంజీవి మంగళవారం అభిమాన సంఘాల నాయకులతో భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీలో రఘువీరా రెడ్డి, వట్టి వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు ముగ్గురు అభిమాన సంఘాల నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం రఘువీరా రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

Raghuveera reddy offer to Chiranjeevi fans

చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఉన్నందున తాము ఈ పార్టీని బలోపేతం చేస్తామని చిరు అభిమానులు తమకు చెప్పారని రఘువీరా చెప్పారు. పదమూడు జిల్లాల చిరు అభిమానులు ఈ నెల 15వ తేదీలోగా కాంగ్రెసు పార్టీ సభ్యుత్వం తీసుకోనున్నారన్నారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ క్యాడర్‌తో కలిసి పార్టీ బలోపేతానికి వీరు భాగస్వాములు అవుతారన్నారు.

చిరు అభిమానులు, నాటి పిఆర్పీ నాయకులు టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే తాము వారి అభ్యర్థిత్వాలను పరిశీలిస్తామని చెప్పారు. అర్హులకు కాంగ్రెసు పార్టీ తప్పకుండా టిక్కెట్లు ఇస్తుందన్నారు. సీమాంధ్రలోని చిరు అభిమానులు అందరూ కాంగ్రెసు పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, చిరు అభిమానులకు పార్టీలో సముచిత గౌరవం ఇస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+