వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంగ్రాచ్యులేష‌న్స్ జ‌గ‌న్ రెడ్డి జీ! రాహుల్ గాంధీ: ఫోన్ చేసిన మ‌మ‌తా బెన‌ర్జీ

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రెండ‌వ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి దేశ‌వ్యాప్తంగా అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు, డీఎంకే అధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ స్వ‌యంగా వైఎస్ జ‌గ‌న్‌కు అభినందించ‌డానికి విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వంలో పాల్గొన్నారు. అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కూడా వైఎస్ జ‌గ‌న్‌కు త‌మ అభినంద‌న‌ల‌ను తెలిపారు.

కృష్ణా జలాల్లో స‌మ‌స్య‌లున్నాయ్‌! గోదావ‌రి నీటిని పూర్తిగా వినియోగించుకోండి: కేసీఆర్ కృష్ణా జలాల్లో స‌మ‌స్య‌లున్నాయ్‌! గోదావ‌రి నీటిని పూర్తిగా వినియోగించుకోండి: కేసీఆర్

వైఎస్ జ‌గ‌న్ విజ‌య‌వాడ‌లోని ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ప్ర‌మాణ స్వీకారం చేస్తోన్న స‌మ‌యంలోనే రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తోన్న జ‌గ‌న్ రెడ్డికి అభినంద‌న‌లు అంటూ ఆయ‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయ‌న‌కు, ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులకు, ఏపీ ప్ర‌జ‌ల‌కు తాను శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు.

Rahul Gandhi congratulate to YS Jagan for his sworn as CM of AP

కాగా- ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌మాణ స్వీకారా మ‌హోత్స‌వానికి ముందే వైఎస్ జ‌గ‌న్‌కు ఫోన్ చేశారు. త‌న అభినంద‌న‌ల‌ను తెలిపారు. ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందిస్తార‌ని తాను ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. 22 మంది లోక్‌స‌భ స‌భ్యుల స‌హ‌కారంతో దేశ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాల‌ని తాను అకాంక్షిస్తున్న‌ట్లు దీదీ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో అభివృద్ధి చెందాల‌ని దేశ ప్ర‌జ‌లంద‌రూ కోరుకుంటున్నార‌ని చెప్పారు.

English summary
All India Congress Committee President Rahul Gandhi has congratulates YS Jagan Mohan Reddy for his oath-taking as Chief Minister of Andhra Pradesh. He tweeted that, Congratulations to Jagan Reddyji on being sworn in as the CM of Andhra Pradesh. My best wishes to him, his new team of ministers and to all the people of the state, Rahul added. Earlier, Trinamool Congress President, Chief Minister of West Bengal Mamatha Benerjee also congratulates to YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X