'అనంత'లో రాహుల్ పర్యటన: సభ నుంచి అలిగి వెళ్లిపోయిన కోట్ల (ఫోటోలు)

అనంతపురం: యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జాతీయ ఉపాధి హామీ పథకం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం అనంతపురం జిల్లా బండ్లపల్లిలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా బండ్లపల్లిలో ఉపాధి హామీ కూలీలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఉపాధి హమీ కూలీల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి రాహుల్ గాంధీ సహపంక్తి భోజనం చేశారు.

 'అనంత'లో రాహుల్ పర్యటన: సభ నుంచి అలిగి వెళ్లిపోయిన కోట్ల

'అనంత'లో రాహుల్ పర్యటన: సభ నుంచి అలిగి వెళ్లిపోయిన కోట్ల

జాతీయ ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాయో ఆయన ప్రజలకు వివరించారు. ముందుగా బండ్లపల్లిలోని మున్సిపల్ హైస్కూల్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 'అనంత'లో రాహుల్ పర్యటన: సభ నుంచి అలిగి వెళ్లిపోయిన కోట్ల

'అనంత'లో రాహుల్ పర్యటన: సభ నుంచి అలిగి వెళ్లిపోయిన కోట్ల

2006లో యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బండ్లపల్లిలోనే ప్రారంభించింది. బండ్లపల్లి గ్రామంలో ఉపాధిహామీ కూలీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు మంగళవారం మధ్యాహ్నాం అనంతపురం జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు.

 'అనంత'లో రాహుల్ పర్యటన: సభ నుంచి అలిగి వెళ్లిపోయిన కోట్ల

'అనంత'లో రాహుల్ పర్యటన: సభ నుంచి అలిగి వెళ్లిపోయిన కోట్ల

పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ అక్కడి నుంచి నేరుగా వెళ్లి సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. అనంతరం పుట్టపర్తి నుంచి అనంతపురంలోని బండ్లపల్లిలో బయల్దేరి వెళ్లారు. ఇది ఇలా ఉంటే బండ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సభా వేదిక పైకి వెళ్లే వారి జాబితాలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ పేరు లేదు.

 'అనంత'లో రాహుల్ పర్యటన: సభ నుంచి అలిగి వెళ్లిపోయిన కోట్ల

'అనంత'లో రాహుల్ పర్యటన: సభ నుంచి అలిగి వెళ్లిపోయిన కోట్ల

దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని అడ్డుకున్నారు. దీనిని అవమానంగా భావించిన కోట్ల రాహుల్ గాంధీ సభ నుంచి అలిగి వెళ్లిపోయారు. దీనిపై కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ విషయంలో హైకమాండ్ జోక్యం చేసుకునే వరకు కర్నూలు కాంగ్రెస్ ఆఫీసుకు తాళం వేస్తామని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+