రైల్లో మంటలు: మృతులు మాంసపు ముద్దల్లా మారారు
హైదరాబాద్: నాందేడ్ - బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మరమించిన ప్రయాణికుల మృతదేహాలు మాంసపు ముద్దల్లా మారాయి. ఎక్స్‌ప్రెస్ రైలు డి1 ఎసి బోగీలో ప్రయాణిస్తున్న 23 మంది మృతదేహాలు కూడా అలా మారాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎసి బోగీలో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఇద్దరు చిన్నారులు. మృతదేహాలు గుర్తు పట్టడానికి వీలు లేకుండా కాలిపోయాయి.
రైలు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని రైల్వే అధికారులు భావిస్తున్నారు. బోగీలో మంటలు ప్రారంభం కాగానే ప్రయాణికులు లేచి, చైన్ లాగి రైలును ఆపేశారు. కొంత మంది కిందికి దిగిపోయారు. మంటలు తీవ్రం కావడంతో 23 మంది మరణించారు.

నాందేడ్ - బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో ముగ్గురు కర్నూలు జిల్లా ఆదోనీకి చెందినవారున్నారు. వారిని బసవరాజు, సర్వమంగళం, భీమయ్యలుగా గుర్తించారు. రైలు ప్రమాదం ఘటనా స్థలాన్ని మంత్రి రఘువీరా రెడ్డి, పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్ిడ పరిశీలించారు. ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
క్షతగాత్రులు, మృతుల సమాచారం రైల్వే శాఖ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. బెంగళూర్ హెల్ప్‌లైన్ - 080 2235 4108, 080 2225 9271, 080 2215 6554












Click it and Unblock the Notifications