బోగిలు లేకుండానే ముందుకు సాగిన రైలు.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నుండి తెగిపోయిన బోగీలు

రైల్వేశాఖలో వేగంగా అధునికత పెరుగుతున్నా ఆ శాఖ మాత్రం వాటిని అందిపుచ్చుకోవడం లేదు.. దీంతో రైల్వే శాఖ నిర్లక్ష్యానికి ప్రయాణికులు బలవుతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రయాణికులతో వెళుతున్న రైలు ఇంజన్ నుండి బోగీలు విడిపోయాయి. ఇక సిగ్నల్ చూస్తూనే డ్రైవింగ్ చేస్తున్న లోకో‌ డ్రైవర్ మాత్రం వెనక్కి చూడకుండా బోగీలను వదిలి ఇంజిన్‌తోనే ప్రయాణించాడు. ఇలా బోగీలను వదిలి కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ విషయాన్ని గమనించాడు. వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుండి బయటపడేశాడు. కాని అదృష్ట వశాత్తు వెనక నుండి మరోరైలు రాకపోవడంతోపాటు బోగిలతో కూడిన రైలు పట్టాలు తప్పకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

Rail coaches were divided from the Vishakha Express near Narsipatnam

సోమవారం సాయంత్రం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని భువనేశ్వర్ నుండి సికింద్రాబాద్ వేళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ నుండి బోగీలు విడిపోయాయి. రైలు నర్సీపట్నం సమీపానికి చేరుకోగానే ఇంజిన్‌, బోగీలను కలిపే లింక్ ఊడిపోయింది. దీంతో బోగీలు లేకుండా ఇంజిన్ చాల దూరం వెళ్లిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది సమీపంలోని రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించారు. అనంతరం సిబ్బంది చేరుకుని ఇంజిన్‌కు బోగిల లింకును కలిపిన తర్వాత రైలును పంపిచారు. దీంతో రైలు విశాఖ ఎక్స్‌ప్రెస్ సుమారు 45 నిమిషాల పాటు నిలిచిపోయింది. అయితే ఇంజిన్ నుండి బోగీలు విడిపోయిన సంధర్భంలో రైలు తక్కువ స్పీడుతో వెళుతుందని , దీంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+