ఏపీ ప్రజలకు రైల్వేశాఖ అలర్ట్...పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసిన ఈస్ట్ కోస్ట్..
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ అలర్ట్ ప్రకటించింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ కోరింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఖుర్దారోడ్ డివిజన్, ఖుర్దారోడ్-బ్రహ్మపూర్ సెక్షన్ పరిధిలో నడిచే పలు రైళ్లను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
జనవరి 31న తిరుపతిలో ఉదయం 10.40 గంటలకు బయల్దేరాల్సిన ట్రైన్ ఆలస్యంగా నడుస్తోన్నట్లు తెలిపారు. తిరుపతి-పూరీ(17480) ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.40 గంటలకు బయల్దేరుతుంది. జనవరి 31న పుదుచ్చేరిలో మధ్యాహ్నం 2.15 గంటలకు వెళ్లాల్సిన ట్రైన్ కూడా ఆలస్యంగా నడుస్తోన్నట్లు వివరించారు. మధ్యాహ్నం బయలుదేరాల్సిన పుదుచ్చేరి-హౌరా (12868) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5గంటలకు బయల్దేరనుంది.

జనవరి 31న చైన్నె సెంట్రల్‌లో రాత్రి 7 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్ చైన్నె సెంట్రల్- హౌరా(12840) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 9.30 గంటలకు బయల్దేరనుంది. ఇక, ఈ నెల 31న సికింద్రాబాద్‌లో బయలుదేరాల్సిన ట్రైన్ ఆలస్యంగా నడుస్తోన్నట్లు వివరించారు. సాయంత్రం 4.50 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్-హౌరా(17016) విశాఖ ఎక్స్‌ప్రెస్ రాత్రి 7.35గంటలకు బయల్దేరనున్నట్లు వివరించారు.
పలు రైళ్లు ఆలస్యం...
ఫిబ్రవరి 1న సంత్రాగచ్చిలో ఉదయం 5 గంటలకు బయల్దేరాల్సిన సంత్రగచ్చి-తాంబరం (06054) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7 గంటలకు బయల్దేరనున్నట్లు తెలిపారు. జనవరి 31న ఎంజీఆర్ చైన్నె సెంట్రల్‌లో రాత్రి 7.50 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్ చైన్నె సెంట్రల్-షాలిమర్(22826) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 10.10గంటలకు ఆలస్యంగా బయలుదేరనుంది. ఈ నెల 31న తిరునల్వేలిలో తెల్లవారుజామున మూడు గంటలకు బయల్దేరాల్సిన తిరునల్వేలి- పురూలియా (22606) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.15 గంటలకు బయల్దేరనుంది.
వచ్చే నెల 1వ తేదీన భువనేశ్వర్‌లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయల్దేరాల్సిన భువనేశ్వర్-ఎంజీఆర్ చైన్నె సెంట్రల్(12830) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరుతుంది. అదే రోజు పూరీలో మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరాల్సిన పూరీ-గుణుపూర్(18417) ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరనుంది. ఫిబ్రవరి 1వ తేదీన గుణుపూర్‌లో ఉదయం 5 గంటలకు బయల్దేరాల్సిన గుణుపూర్-పూరీ(18418) ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా ఉదయం 9గంటలకు బయల్దేరనుంది.












Click it and Unblock the Notifications