తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు, రిజర్వేషన్లు షురూ - రూట్.. షెడ్యూల్..!!
అయ్యప్ప భక్తులు రైల్వే బిగ్ అప్డేట్. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లే శబరిమల భక్తు ల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రోజు నుంచి రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల నుంచి మకస సంక్రాంతి వరకు ఈ ప్రత్యేక రైళ్లు కొనసాగనున్నాయి. ఈ మేరకు రైళ్ల వివరాలతో పాటుగా స్టేషన్లు, షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. దీని ద్వారా ఈ రెండు నెలల కాలంలో శబరిమలకు వెళ్లే భక్తులకు వెసులుబాటు కలగనుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల మండల-మకరవిళక్కు సీజన్లో ప్రయాణించే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉండటంతో, దక్షిణ మధ్య రైల్వే 54 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్, చర్లపల్లి టెర్మినల్స్తో పాటు నల్గొండ-గుంటూరు మరియు కాజీపేట-విజయవాడ రెండు ప్రధాన మార్గాలను కలుపుతూ 54 ప్రత్యేక రైళ్లను నడపేలా నిర్ణయించారు. శబరిమలకు గేట్వేగా పిలిచే చెంగన్నూర్, కొట్టాయం స్టేషన్లలో అన్ని ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ ఇవ్వడం వల్ల భక్తులకు సమయం, రవాణా వ్యయం ఆదా అవుతాయి. చర్లపల్లి - కొల్లం - చర్లపల్లి (07199/07200) మధ్య 6 ప్రత్యేక సర్వీసులను ప్రకటించారు. డిసెంబర్ 30, జనవరి 6, 13 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరి; జనవరి 1, 8, 15 తేదీల్లో కొల్లం నుంచి తిరిగి వస్తాయి. ఈ రైలు భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది.

రిజర్వేషన్లు ప్రారంభం.. రూట్
అదే విధంగా 07193: డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (శనివారం) రాత్రి 11:10 గంటలకు హైదరాబాద్లో బయల్దేరి సోమవారం ఉదయం 7:15 గంటలకు కొల్లం చేరుకుంటుంది. కాగా, 07194: డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో (సోమవారం) ఉదయం 10:55 గంటలకు కొల్లంలో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. కాగా..చర్లపల్లి - కొల్లం - చర్లపల్లి (07180/07181) - 12 సర్వీసులు ఏర్పాటు చేసారు. 07180: నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో (శుక్రవారం) రాత్రి 11:45 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి ఆదివారం ఉదయం 7:55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఈ 54 ప్రత్యేక రైళ్లకు సంబంధించి అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్స్ నవంబర్ 13 ఉదయం 8 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి.













Click it and Unblock the Notifications
