విశాఖ నుంచి రెండు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు..!!
రైల్వే అధికారులు కీలక ప్రకటన చేసారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ వైపు ప్రధాన రైళ్ల రూట్లలో మార్పులు చేసారు. కాగా, తాజాగా రెండు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్ల రద్దు పైన అప్డేట్ ఇచ్చారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ తో పాటుగా పలు ప్రాంతాలకు ప్రధాన రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ కు వచ్చే పలు రైళ్లను చర్లపల్లికి పరిమితం చేసారు. తాజాగా విశాఖ నుంచి నడిచే రెండు ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రెండు రైళ్ల రద్దు
సామర్లకోట - రావికంపాడు మధ్యన ఆటో మేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సింహాద్రి, ఉదయ్ ఎక్స్ ప్రెస్ లను రద్దు చేస్తున్నట్లు అధికారు లు ప్రకటించారు. ఈ నెల 23,24 తేదీల్లో గంటూరు - విశాఖ సింహాద్రి ఎక్స్ ప్రెస్ అదే విధంగా ఈ నెల 24,25 తేదీల్లో విశాఖ - గుంటూరు సింహాద్రి .. 24న ఉదయ్ ఎక్స్ ప్రెస్ ను రెండు వైపు లా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకు న్న వారు ఈ మార్పులు గమనించాలని అధికారులు సూచించారు.

చర్లపల్లి వరకే
తాజాగా రైల్వే అధికారులు సికింద్రాబాద్ కు రాకపోకలు సాగించే నాలుగు ప్రధాన రైళ్లను చర్లపల్లి వరకే నడుపుతున్నారు. ఇక, ఇప్పుడు విశాఖ నుంచి లింగంపల్లికి రాకపోక లు సాగించే ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైలుకు సికింద్రాబాద్ లో స్టాపు ను రద్దు చేసారు. జన్మభూమి ఇక నుంచి రైల్వే శాఖ మరో కీలక ప్రకటన చేసింది. విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కు సికింద్రాబాద్‌లో స్టాప్‌ను రద్దు చేశారు. ఏప్రిల్ 25 నుంచి ఇది అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలును చర్లపల్లి-అమ్ముగూడ-సనత్‌నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25 నుంచి సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్ల వైపు వెళ్లదని అధికారులు తెలిపారు.
రాకపోకల్లో మార్పులు
ఇక.. విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ కు డిమాండ్ పెరుగుతోంది. ఈ రైలుకు కొద్ది రోజుల క్రితం కోచ్ ల సంఖ్య పెంచారు. ఇంకా రద్దీ కొనసాగుతోంది. ఈ రైలు నిత్యం ఆలస్యంగా నడుస్తుండటం పైన ప్రయాణీకుల్లో అసహనం కనిపిస్తోంది. ఈ వందేభారత్ కోసం ఈ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆలస్యం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. సికింద్రాబాద్ స్టాపు రద్దు చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావటంతో సికింద్రాబాద్ కు రాకపోకలు సాగించే పలు ప్రధాన రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసారు. అందులో భాగంగా విశాఖ, చెన్నై నుంచి పలు రైళ్లల్లో ఈ కొత్త నిర్ణయాలు అమల్లోకి తెస్తున్నారు.












Click it and Unblock the Notifications