రైలు ప్రయాణికులకు శుభవార్త.. విశాఖ తిరుపతితో పాటు ఆ ప్రత్యేకరైలు పొడిగింపు!

రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. రైలు ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయడానికి వీలుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా వేసవిని దృష్టిలో పెట్టుకొని మరొక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.

పలు ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
ఇప్పటికే వేసవిలో ప్రజల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. విశాఖ తిరుపతి, భువనేశ్వర్ యశ్వంతపూర్ మధ్య నడుస్తున్న రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్టు రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.

railway Good news for ap Visakhapatnam-Tirupati bhuvaneswar yashwantapur special trains extension

విశాఖ తిరుపతి ప్రత్యేక రైలు పొడిగింపు
విశాఖ తిరుపతి మధ్య నడిచే 08583 రైలు ప్రతి సోమవారం నడుస్తుంది. దీని గడువును మే 5వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. మరోవైపు తిరుగు ప్రయాణంలో 08584 రైలు ప్రతి మంగళవారం నడుస్తుంది. ఈ రైలును జూలై ఒకటవ తేదీ వరకు పొడిగించినట్టు తెలిపింది.

ఏపీలో ఈ ప్రాంతాలలో రైలు ప్రయాణికులకు శుభవార్త
ఇక ఈ రైలును పొడిగించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల ,ఒంగోలు, నెల్లూరు, శ్రీకాళహస్తి రేణిగుంట స్టేషన్ లలో రైల్వే ప్రయాణికులకు లబ్ధి జరుగుతుంది. మొత్తం దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైలును పొడిగించడం వల్ల 18 ట్రిప్పులు ఈ రైలు ప్రజలకు సేవలను అందిస్తుంది.

భువనేశ్వర్ యశ్వంతపూర్ ప్రత్యేక రైలు పొడిగింపు
కాగా భువనేశ్వర్ యశ్వంతపూర్ 02811 రైలును కూడా పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలును మే 24వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు ప్రతి శనివారం నడపనున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో 02812 రైలు ప్రతి సోమవారం నడవనుంది. ఈ రైలు ప్రతి సోమవారం జూన్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ స్టేషన్ లలో రైలు ప్రయాణికులకు సౌకర్యం
ఈ ప్రత్యేక రైలు పొడిగింపు తో ఖుర్దా రోడ్, బ్రహ్మపుర, పలాస, శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం, ఎస్ ఎస్ ఎస్ పి నిలయం, హిందూపురం స్టేషన్లలో రైల్ ప్రయాణికులకు వేసవిలో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రైలు పొడిగింపు నేపథ్యంలో 12 ట్రిప్పులు తిరుగుతుంది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల రైల్వే ప్రయాణికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+