ఏపీలో అక్కడ హాల్టింగ్.. శుభవార్త చెప్పిన వందేభారత్ రైలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిలో రైల్వే కీలక భూమిక పోషిస్తుంది. ఏపీలో అమృత్ భారత్ పథకం ద్వారా స్టేషన్లను అభివృద్ధి చేయడంతో పాటు వందే భారత్ రైళ్లతో, కొత్త లైన్లతో ఏపీ రైల్వే వ్యవస్థను పరిపుష్ఠం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలకు తగ్గట్టు, మారుతున్న ఆధునిక కాలానికి తగ్గట్టు హై ఫై వసతులతో వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది భారతీయ రైల్వే.
వారికి రైల్వే శుభవార్త
ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు, వేగంగా గమ్యస్థానాలకు చేర్చడానికి రైల్వే వందే భారత్ ట్రైన్స్ ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైల్వే ప్రయాణికులకు రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ విషయంలో ఒక శుభవార్త చెప్పింది. దీంతో ఆ ప్రాంత ప్రజల రైలు ప్రయాణం సాఫీగా హ్యాపీగా సాగనుంది.

అక్కడ వందేభారత్ హాల్టింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ విశాఖ మధ్య వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ట్రైన్ లో ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సహజంగా వందే భారత్ రైలు చాలా తక్కువ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది అయితే ఆరు నెలల క్రితం వందే భారత్ రైలును సామర్లకోటలో ఆపాలని ప్రయోగాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు.
వారికి మళ్ళీ శుభవార్త
తాజాగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట రైల్వే స్టేషన్లో వందే భారత్ హాల్టింగ్ విషయం పైన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. ఈ స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు రెగ్యులర్ హాల్ట్ లేకపోవడంతో సామర్లకోట ప్రజలు ఇక్కడ వందే భారత్ హాల్ట్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో ప్రయోగాత్మకంగా అక్కడ ఆరు నెలల క్రితం హాల్ట్ ను ఏర్పాటు చేశారు.
సంతోషంలో సామర్లకోట వాసులు
అయితే ఆ గడుపు త్వరలోనే ముగియనున్న క్రమంలో మరో ఆరు నెలలు దానిని పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ఆగస్టు 3 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అయితే రైల్వే తీసుకున్న తాజా నిర్ణయంతో సామర్లకోట ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ డిమాండ్ ఉన్న ఈ మార్గంలో వందే భారత్ రైలుకు సామర్లకోటలో హాల్టింగ్ పాయింట్ ఇవ్వడం పట్ల వారు దక్షిణ మధ్య రైల్వేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications