వందే భారత్ స్లీపర్​ రైలు ప్రారంభం, రూట్ల పై రైల్వే మంత్రి కీలక ప్రకటన..!!

రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్ల పైన మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేసారు. ఈ రైళ్లు ముందుగా ప్రయాణించే రూట్ పైన స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే వందేభారత్ రైళ్లకు దేశ వ్యాప్తంగా ఆదరణ కనిపిస్తోంది. అదే విధంగా దూరం ప్రాంతాలకు వెళ్లేందుకు వందేభారత్ స్లీపర్ రైళ్లను సిద్దం చేస్తున్నారు. దీపావళికి ఈ రైళ్లు పట్టాలు ఎక్కుతాయనే భావించారు. ఈ సమయంలోనే మంత్రి క్లారిటీ ఇచ్చారు. దీంతో.. ఇప్పుడు రైల్వే ప్రయాణీకులకు కొత్తగా వందేభారత్ స్లీపర్ అందుబాటులోకి రానున్నాయి.

రైల్వే ప్రయాణీకులు ఎంత గానో ఎదురు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభం పై మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 15 నాటికి ఈ స్లీపర్ రైళ్లు సిద్దం అవుతాయని.. వెంటనే ప్రారంభిస్తామని ప్రకటించారు. మొదటి రైలు సిద్ధం కాగా, రెండో రైలు నిర్మాణంలో ఉందని.. ఈ రెండు రైళ్లను ఒకే సారి ప్రారంభిస్తామని స్పష్టం చేసారు. ప్రారంభించిన తరువాత నిరంతరాయం గా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చారు. కాగా, పాట్నా - ఢిల్లీ మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఒక రైలు ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, దీనిని ప్రస్తుతం దిల్లీలోని శాకుర బస్తీ కోచింగ్ డిపోలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.

railway-minister-key-announcement-over-vandebharat-sleeper-launch-and-route

దేశంలో తొలి వందేభారత్‌ స్లీపర్ రైలు చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ 2024 డిసెంబర్‌లో తయారు చేసినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. 16 కోచ్‌లతో కూడిన వందే భారత్ స్లీపర్​ రైలు ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసారు. గంటకు 180కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణించేలా ఈ రైలును సిద్దం చేసారు. ఆ తర్వాత ముంబయి-అహ్మదాబాద్‌ సెక్షన్‌లో 540కి.మీ మార్గంలో ఈ ఏడాది జనవరి 15న వందేభారత్‌ స్లీపర్‌ ట్రయల్‌రన్‌ నిర్వహించింది. ఈ రైలులో ప్రయాణీకుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే కవచ్‌ వ్యవస్థ ఉంటుంది. అన్ని కోచ్‌లు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కార్‌ బాడీతో GFRP ఇంటీరియర్ ప్యానెల్స్ కలిగి ఉంటాయి. అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు.

ఇక, వీటిల్లో ఆటోమేటిక్‌ డోర్లు, మెరుగైన సదుపాయాలతో మరుగు దొడ్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్‌లు ఇందులో పెట్టారు. 16 కోచ్‌లు, 823 బెర్త్‌లతో వందే భారత్​ స్లీపర్‌ ట్రైన్‌ రానుంది. ఇందులో 3టైర్‌ ఏసీ కోచ్‌లు (600 బెర్త్‌లు) 11 ఉండగా, 2 టైర్‌ ఏసీ కోచ్‌లు (188 బెర్త్‌లు) 4 ఉంటాయి. ఇకా ఒక ఫస్ట్‌ టైర్‌ ఏసీ కోచ్‌(24 బెర్త్‌లు) ఉంటాయి. వందే భారత్‌ రైళ్లు మూడు వెర్షన్లలో రానున్నాయి. ఇప్పటికే సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఛైర్‌కార్‌ రైళ్లు వివిధ నగరాల మధ్య నడుస్తున్నాయి. కాగా, ఎక్కువ దూరం ప్రయాణించే వారికి వందే భారత్​ స్లీపర్‌ వెర్షన్‌ను పట్టాలెక్కించనున్నారు. ఇక.. త్వరలోనే వందే మెట్రో రైలును కూడా తీసుకురానున్నారు. దీంతో, వీటి కోసం ప్రయాణీకులు ఆసక్తిగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+