విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రైలు ప్రమాదం తరువాత గత వారం రోజులుగా ఆ మార్గం నుంచి విశాఖ మీదుగా దక్షిణాది ప్రాంతాలకు వస్తున్న పలు రైళ్లను రద్దు చేయటం..దారి మళ్లించారు. తిరిగి పలు రైళ్లను ఆ మార్గంలో పునరుద్దరించారు. కొత్త ట్రాక్ సిద్దం చేసారు. రైళ్ల రాక పోకలు తిరిగి ప్రారంభిస్తున్న సమయంలో వందేభారత్ సమయాల్లో మార్పు చేసారు.

విశాఖ - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్(20833) ప్రయాణీకులకు రైల్వే అధికారులు కీలక సమాచారం ఇచ్చారు. ఆదివారం మినహా వారంలో ప్రతీ రోజు ఈ రైలు ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయల్దేరి మధ్నాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అయితే, ఈ రోజు (జూన్ 10) మాత్రం నాలుగు గంటలు ఆలస్యంగా ఈ రైలు విశాఖ నుంచి బయల్దేరుతుందని వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ ప్రకటించారు.

Railway officials announces Visakaha to SEcbad Vandebharat rescheduled on 10th june

ఈ రోజు 9.45 గంటలకు విశాఖ నుంచి వందేభారత్ బయల్దేరనుంది. దీనికి సాంకేతిక అంశాలే కారణంగా చెబుతున్నారు. విశాఖ నుంచి 9.45 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.15 గంటలకు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా సికింద్రాబాద్ చేరుకోనుంది.

ప్రతీ రోజు తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ లో మధ్నాహ్నం 3 గంటలకు వందేభారత్ బయటల్దేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రోజు నాలుగు గంటలు ఆలస్యం గా రైలు ప్రారంభం కానుండటంతో ఆదివారం తెల్లవారు జామున వందేభారత్ తిరిగి విశాఖ చేరుకొనే అవకాశం కనిపిస్తోంది.

సోమవారం నుంచి ఈ రైలు యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే నడవనుందని అధికారులు చెబుతున్నారు. జనవరిలో ప్రారంభించిన ఈ వందేభారత్ కు ఆశించిన స్థాయి కంటే ఆదరణ పెరిగింది. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వరకు వందేభారత్ కోసం ప్రతిపాదనలు ఒడిశా ప్రభుత్వం నుంచి అందాయి. వేసవి సెలవులు ముగుస్తున్న సమయంలో వందేభారత్ కు మరింత రద్దీ కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+