శబరిమలకు 64 ప్రత్యేక రైళ్లు - రూట్లు, షెడ్యూల్ ఇలా..!!
తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తున్నారు. ఇప్పటికే ఖరారు చేసిన రైళ్లల్లో భారీగా వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. భక్తుల డిమాండను గుర్తించిన అధికారులు తెలుగు రాష్ట్రాల నుంచి మరో 64 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఈ మేరకు రైళ్లు నడిచే తేదీలు, షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు.
అయ్యప్ప భక్తుల కోసం సికింద్రాబాద్ - కొల్లం మధ్య డిసెంబర్ 10,17,24,31. జనవరి 9,14, తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. నర్సాపూర్ - కొట్టాయం మధ్య డిసెంబరు 10,17,24,31, జవనరి 7,14 తేదీల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి సికింద్రాబాద్ కు డిసెంబర్ 12,19,26, నవరి 9,16..అదే విధంగా, కొట్టాయం నుంచి నర్సాపూర్ కు డిసెంబర్ 11,18,25 తేదీలతో పాటుగా జనవరి 1,8,15 ప్రత్యేక రైళ్లు బయల్దేరుతాయి. అదే విధ:గా శ్రీకాకుళ: రోడ్ - కొల్లం ప్రత్యేక రైళ్లు నవంబర్ 25, డిసెంబర్ 2,9,16,23,30, జనవరి 6,13,20,27 తేదీల్లో ఉంటాయని వెల్లడించారు.

విశాఖపట్నం - కొల్లం మధ్య నవంబర్ 29,డిసెంబర్ 6,13,20,27, జనవరి 3,10,17,24,31 తేదీల్లో ఉంటాయి. కొల్లం నుంచి శ్రీకాకుళ: రోడ్ కు నవంబర్ 26, డిసెంబర్ 3,10,17,24,31, జనవరి 7,14,21,28 తేదీలతో పాటుగా..డిసెంబర్ 7,14,21,28, జనవరి 4,11,18,25 తేదీల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. శబరిమలకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక రైళ్లల్లో ఫస్ట్, సెంకడ్, థర్డ్ ఏసీ, స్లీపర్ ,జనరల్ బోగీలు ఉంటాయి. ఇప్పటికే కేరళ రాష్ట్రానికి ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే అన్ని రైళ్లు సంక్రాంతి 15వ తేదీ వరకు నిండుకున్నాయి. వెయిటింగ్ లిస్టు భారీగా ఉంది. కొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. కానీ, ఇంకాడిమాండ్ ఉండటంతో తాజాగా ఈ మార్గాల్లో 64 ప్రత్యేక రైళ్లను అధికారులు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications